తలైవార్…స్పీడ్ పెంచాడు!!!

  • November 5, 2016 / 10:04 AM IST

తమిళ సూపర్ స్టార్ తలైవార్…..రజనీకాంత్…..ఇప్పుడు రోబో2 లో మెరవనున్నాడు…తాజాగా హెల్త్ చెకప్స్ కోసం అమెరికా వెళ్ళి వచ్చిన రజనీకాంత్…ఈ మధ్యనే ఇండియా తిరిగి వచ్చారు….అదే క్రమంలో దీపావళి పండగ సైతం కుటుంభ సభ్యులతో కలసి జరుపుకున్నారు….ఇదిలా ఉంటే కాస్త రిలాక్స్ అయ్యీ ఈరోజు నుంచి రోబో2 షూటింగ్ లో పాల్గొనడానికి సిద్దం అయిపోయాడు రజని. అదే క్రమంలో ఈసారి రెట్టించిన వేగంతో పని చేసేలా ప్లాన్ చేసుకున్నాడు రజని. అసలైతే ముందుగా అనుకున్న ప్రకారం షూటింగ్ ఇప్పటికీ మొదలైయి 30శాతం పూర్తి అయ్యి ఉండాల్సింది…అయితే రజని ఆరోగ్య దృష్ట్యా కాస్త లేట్ కావడంతో…వాటిని కూడా కవర్ చెయ్యాలనే ఆలోచనతో ఉన్నాడు మన సూపర్ స్టార్.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ ని ఫినిష్ చేసేందుకు రజినీకాంత్ ఎంతగా ఫిక్స్ అయ్యారంటే.. ఈ సారి సినిమాలో తన వంతు భాగం షూటింగ్ మొత్తం పూర్తయ్యే వరకూ బ్రేక్ కూడా తీసుకోరట. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 2.0 పై అంచనాలు చాలానే ఉన్నాయి. వీటిని అందుకునేందుకు టీమ్ మొత్తం బోలెడంత కష్టపడుతోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి.. నవంబర్ 20న ఫస్ట్ లుక్ రిలీజ్ ను ముంబైలో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. మరి రోబో తో ప్రభంజనం సృష్టించిన తలైవార్…ఈ సీక్వేల్ తో ఎలాంటి రికార్డులు నెలకొల్పుతాడో చూడాలి.

https://www.youtube.com/watch?v=K1d-p-_1LgE

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus