సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘జైలర్’ చిత్రం నిన్న గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు రజినీకాంత్ కి మరియు ఆయన అభిమానులకు ఈ సినిమా ఇచ్చిన గూస్ బంప్స్ మామూలు రేంజ్ కాదు. సినిమాలో డైరెక్టర్ నెల్సన్ అడుగడుగునా రజినీకాంత్ మార్క్ కనిపించేలా చూసుకున్నాడు.
రజినీకాంత్ ని అలా వింటేజ్ స్టైల్ మరియు ఎనర్జీ తో చూడడం తో ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ఆడియన్స్ కి కూడా కనుల పండుగ లాగ అనిపించింది. మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు స్టేట్స్ లో అయితే అందరి అంచనాలను మించి 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఆయన గత చిత్రం ‘పెద్దన్న’ తెలుగు స్టేట్స్ లో మొదటి రోజు కేవలం కోటి రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.
కానీ జైలర్ (Jailer Movie) చిత్రం ఏకంగా 8 కోట్లు రాబట్టింది అంటే ఏ రేంజ్ కం బ్యాక్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా రజినీకాంత్ కి ఓవర్సీస్ లో ఉన్నటువంటి మార్కెట్ ఇండియా లో ఏ హీరో కి కూడా లేదని అంటూ ఉంటారు ట్రేడ్ పండితులు. ఒక విధంగా చెప్పాలంటే మన సౌత్ ఇండియా కి ఓవర్సీస్ మార్కెట్ ఓపెన్ అయ్యిందే రజినీకాంత్ వల్ల. ఇప్పుడు సూపర్ స్టార్ కి చాలా కాలం తర్వాత హిట్ టాక్ వచ్చింది.
అంతే ఓవర్సీస్ లో ఒక్క రేక కూడా మిగలకుండా దంచి కొడుతున్నాడు. ఈ ఏడాది అత్యధిక ఓవర్సీస్ వసూళ్లను సాధించిన చిత్రం గా షారుఖ్ ఖాన్ ‘పఠాన్‘ చిత్రం నిల్చింది. మొదటి రోజు ఈ చిత్రానికి అన్నీ ఫారిన్ దేశాలకు కలిపి 4.6 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. కానీ జైలర్ చిత్రానికి 5 మిలియన్ డాలర్స్ వచ్చాయి. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 40 కోట్ల రూపాయిల గ్రాస్ అన్నమాట. ఇక రాబొయ్యే రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతుందో చూడాలి.