Rajinikanth: వైరల్‌ వీడియో: తలైవా ఎంట్రీ… దద్దరిల్లిపోతున్న షూటింగ్‌ స్పాట్‌!

రజనీకాంత్‌ ఛరిస్మా తగ్గిపోయింది, విజయాలు లేవు, అన్నీ పరాజయాలే.. అంటూ నిట్టూర్పుల పర్వం కొనసాగుతున్న సమయంలో ‘జైలర్‌’ సినిమాతో తలైవా తన తడాఖా ఏంటో మరోసారి చూపించాడు. అది కూడా మామూలుగా కాదు రూ. 600 కోట్లకుపైగా వసూళ్లతో ‘వన్స్‌ తలైవా ఆల్వేజ్‌ తలైవా’ అంటూ మైమరిపించాడు. ఆ సినిమా తర్వాత రజనీ మరో పదేళ్లు వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు అంటూ అభిమానులు హ్యాపీగా ఉన్నారు. అయితే రజనీ ఎక్కువ సినిమాలు చేసే పరిస్థితి లేదు అంటున్నారు అనుకోండి.

ఆ విషయాలు పక్కనపెడితే.. రజనీ జనాల మధ్యలోకి వస్తే ఎలా ఉంటుందో మొన్నీ మధ్య ‘జైలర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చూశాం. అయితే అది ఆడిటోరియంలో.. ఇప్పుడు సగటు జనాల మధ్యలోకి వస్తే ఆ ప్రాంతం ఎలా సందడిగా మారుతుందో మరోసారి చేసి చూపించారు రజనీ ఫ్యాన్స్‌. ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ తన 170వ సినిమా చిత్రీకరణ కోసం కేరళలో ఉన్నారు. ఈ క్రమంలో షూటింగ్‌ స్పాట్‌కి రజనీ వచ్చినప్పుడు అక్కడి సందడిని అభిమానులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

దీంతో ఆ వీడియోను చూసిన అభిమానులు ‘తలైవా ఎక్కడున్నా సూపర్‌ స్టార్‌… ఎన్ని డిజాస్టర్లు వచ్చినా సూపర్‌ స్టారే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. టీజీ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సామాజిక సందేశంతో రూపొందుతున్న రజనీకాంత్‌ స్టైల్‌ ఎంటర్‌టైనర్‌ అని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కేరళలోని తిరువనంతపురంలో ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. చిత్రీకరణ కోసం రజనీకాంత్ వచ్చిన విషయం తెలుసుకున్న స్థానికులు లొకేషన్‌కు చేరుకున్నారు.

వాళ్లందరికీ రజనీకాంత్‌ (Rajinikanth) కారు నుండి బయటకు వచ్చి అభివాదం చేశారు. ఫ్యాన్స్‌ ‘తలైవా’ ఆనందంతో కేరింతలు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా కోసం రజనీకాంత్‌ కొత్త లుక్‌లో కనిపించారు. 70+ వయసులోనూ యంగ్ హీరోలతో పోటీపడుతున్నారని అభిమానులు కామెంట్స్‌ చేస్తుండటం విశేషం. ఇక ఈ సినిమా సంగతి చూస్తే… అమితాబ్‌ బచ్చన్‌, రానా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

https://twitter.com/i/status/1709955836439859284

 

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus