Rajinikanth, Jr NTR: ఎన్టీఆర్ మూవీని రిజెక్ట్ చేసిన సూపర్ స్టార్..?

  • May 25, 2021 / 11:04 AM IST

తనకు మాత్రమే సొంతమైన ప్రత్యేకమైన స్టైల్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళంతో పాటు ఇతర భాషల్లో అభిమానులను సంపాదించుకున్నారు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా రజనీకాంత్ సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటుండగా ప్రస్తుతం రజనీకాంత్ అన్నాత్తే సినిమాలో నటిస్తున్నారు. అయితే రజనీకాంత్ కు కొన్నేళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా రీమేక్ లో నటించే ఆఫర్ వచ్చింది. సింహాద్రి సినిమాను చూసిన రజనీకాంత్ 20 ఏళ్ల వయస్సులోనే ఎన్టీఆర్ ఆ పాత్రలో అద్భుతంగా నటించిన తీరును చూసి ఆశ్చర్యపోయారు.

భవిష్యత్తులో ఎన్టీఆర్ కు సరిపోయే కథలు దొరకడం అంత తేలిక కాదని కామెంట్లు చేశారు. అయితే రజనీకాంత్ సింహాద్రి రీమేక్ లో నటించే సాహసం చేయలేకపోయారు. తరువాత కాలంలో ఆ సినిమాను విజయ్ కాంత్ రీమేక్ చేయగా అక్కడ ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. రజనీకాంత్ ఊహించినట్లే జూనియర్ ఎన్టీఆర్ కు ఒక దశలో సరైన కథలు దొరకడం కష్టమైంది. శక్తి నుంచి రభస వరకు ఎన్టీఆర్ కు వరుస ఫ్లాపులు పలకరించాయి.’

రజనీకాంత్ జోస్యం తారక్ విషయంలో కొన్నేళ్ల క్రితం వరకు నిజమైనా టెంపర్ సినిమా నుంచి విజయాలు అందుకుంటూ తారక్ సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఫ్యూచర్ ప్రాజెక్ట్ లను కూడా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ నంబర్ 1 స్థానానికి తారక్ గట్టి పోటీని ఇస్తున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus