Rajinikanth: రజనీ కాంత్ 171వ చిత్రానికి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

ఇండియాలో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వారుండరు. ఆయన నటించిన సినిమాలు ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతూ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబట్టుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో వందల కోట్ల మందికి ఆరాధ్య హీరో రజినీ కాంత్. రజనీకాంత్ ఇండియాలోని టాప్ హీరోలలో ఒకరు. కొన్నేళ్లుగా ఆయన నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేదు. కానీ ఇటీవల వచ్చి జైలర్ సినిమా మాత్రం ఆ లోటును పూర్తిగా తీర్చేసింది.

బాస్ ఈజ్ బ్యాక్ లెవల్లో బాక్సాఫీసు రికార్డులను తిరగ రాసి దట్ ఈజ్ రజనీ అనిపించుకుంది. ఈ సినిమాతో రజనీకాంత్ తన స్టామినా అంటే ఏంటో మరోసారి నిరూపించారు. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.600 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ తన తదుపరి చిత్రం తలైవా 171 వ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తో విక్రమ్ వంచి భారీ చిత్రాన్ని తీసిన లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇద్దరు భారీ సక్సెస్ జోష్ లో ఉండడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.

రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా మరో బాక్సాఫీస్ సంచలనం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారుతోంది. అది ఏమిటంటే ఈ చిత్రానికి రజనీ కాంత్ దేశంలో ఏ హీరోకు సాధ్యం కాని రేంజ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారట.

ఈ చిత్రం కోసం (Rajinikanth) రజినీ కాంత్ ఏకంగా రూ. 250 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఆసియాలోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడుగా రజనీ అరుదైన రికార్డు సొంతం చేసుకోవడం ఖాయం. జైలర్ సినిమాతో రజినీ తన స్టామినా ఏంటో నిరూపించడంతో నిర్మాతలు ఇంతటి రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. గతంలో కూడా రజనీకాంత్ జాకీ ఛాన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus