రజని మళ్ళీ తప్పు చేస్తున్నాడా??

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా రిలీజ్ కి ముందు ఎంతటి హైప్ ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అసలైతే ఆ సినిమా హిట్ అయ్యీ ఉంటే రజనీకాంత్ ఫేమ్ ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇప్పటికే ఎన్నో దేశాల్లో రజని అభిమానులు ఉన్నారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ సాధించి ఉంటే, ప్రపంచ వ్యాప్తంగా రజని క్రేజ్ మార్మోగిపోయేది. అయితే దర్శకుడు పా. రంజిత్ తీసుకున్న కధ, తెరకెక్కించిన కధనంలో కొత్తదనం లేకపోవడం, ఇక సెంటిమెంట్ పాళ్లు ఎక్కువ కావడంతో ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టెర్ గా మారిపోయింది తెలుగులో.

అయితే అదే క్రమంలో తమిళంలో ఈ సినిమా కాస్తో కూస్తో వసూళ్లు సాధించడం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం రోబో2లో నటిస్తున్న తలైవార్ తరువాత సినిమా కూడా రంజిత్ దర్శకత్వంలోనే చేస్తున్నాడు అని సమాచారం….ఈ విషయాన్ని స్వయాన తమిళ హీరో, ఆయన అల్లుడు దనుష్ బయట పెట్టాడు..ఆయన ట్వీట్ చేస్తూ..’వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై మా నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేస్తున్నందుకు సంతోషిస్తున్నా’  అంటూ ఓ చిన్న వీడియో షేర్ చేశాడు. స్వయంగా రజినీ అల్లుడు అనౌన్స్ చేశాక డౌట్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. కబాలి లాంటి స్లో నెరేషన్ తో సినిమా ఇచ్చిన రంజిత్ తో మరోసారి రజినీ సినిమా అంటే చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.

కానీ.. కనీసం ఈ మాత్రమైనా అంచనాలు క్రియేట్ చేసి.. వసూళ్లను సీనియర్ డైరెక్టర్లు సాధించలేకపోయారు. కుర్రాడైనా ఈ విషయంలో సక్సెస్ అయిన పా రంజిత్ కే.. రజినీకాంత్ మరోసారి మొగ్గారనే విషయం అర్ధమవుతోంది. అన్నట్లు ఓ మాట చెప్పుకోవాలి.. కబాలి తమిళ్ వెర్షన్ ని హిట్ అనే అనాలి. మరి ఈ అవకాశాన్ని అయినా రంజిత్ ఉపయోగించుకుంటాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus