Rajinikanth, Chiranjeevi: చిరు సూపర్ హిట్ మూవీ టైటిల్ పై కన్నేసిన రజినీ..!

ఈ మధ్య కాలంలో తమిళ స్టార్ హీరోలు వరుసగా మన మెగాస్టార్ చిరంజీవి టైటిల్స్ ను పెట్టుకుంటున్న సందర్భాలను చూస్తూనే వస్తున్నాం. తెలుగు వెర్షన్ లను చిరంజీవి పాత సినిమా టైటిల్స్ ను వాడుకుంటే హైప్ వస్తుందని ఫీలవుతున్నారో ఏమో..! కార్తీ ‘ఖైదీ’ టైటిల్ ను వాడుకున్నాడు. చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా టైటిల్ అది. తర్వాత ‘దొంగ’ టైటిల్ ను కూడా వాడుకున్నాడు కార్తీ. ఆ టైటిల్ తో వచ్చిన చిరు పాత సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక విజయ్ ‘మాస్టర్’ టైటిల్ ను వాడుకున్నాడు.

తెలుగులో కూడా చిన్న, మీడియం రేంజ్ హీరోలు కూడా చిరు టైటిల్స్ ను వాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా… ఇప్పుడు రజినీ కాంత్ కూడా చిరంజీవి టైటిల్ ను వాడుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ‘సిరుతై’ శివ డైరెక్షన్లో ‘అన్నాత్తే’ అనే చిత్రాన్ని చేస్తున్నారు.నయనతార, కీర్తి సురేశ్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘సన్ పిక్చర్స్’ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ షెడ్యూల్ ను ఇటీవల హైదరాబాదులో చిత్రీకరించిన సంగతి తెలిసిందే.ఇక కొత్త షెడ్యూల్ ను కోల్ కతాలో నిర్వహిస్తున్నారు. దీనితో షూటింగ్ పూర్తవుతుందని వినికిడి.

కాగా ఈ చిత్రాన్ని తెలుగులో ‘అన్నయ్య’ టైటిల్ తో విడుదల చేయబోతున్నారట.2000 వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి, సౌందర్య కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ కూడా కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని రజినీకి చిరంజీవి… ‘అన్నయ్య’ టైటిల్ కలిసొస్తుందేమో చూడాలి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus