‘కబాలి’ సినిమాను వాయిదా వేయమన్న రజని!
- February 17, 2016 / 01:53 PM ISTByFilmy Focus
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘భాష’సినిమా తరహాలో చేస్తున్న సినిమా ‘కబాలి’. ఈ సినిమాలో రాధిక ఆప్టే రాజినికంత్ కి జోడీగా కనిపించనుంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్నఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. తమిళ్ న్యూ ఇయర్ రోజున అనగా ఏప్రిల్ 14 న తెలుగు,తమిళ భాషలలో ఒకే సరి విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న రజినీకాంత్ నిర్మాత అయిన కలైపులి ఎస్ థానుకి సినిమా రిలీజ్ ని వాయిదా వేయమని గట్టిగా చెప్పాడు. దానికి కారణం ఏప్రిల్ లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడమే. అందుకే రజినీకాంత్ ఎన్నికల తేదీ విడుదలయ్యాక, దాన్ని బట్టి రిలీజ్ డేట్ ని ఏప్రిల్ చివర్లో లేదా మే లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్కోమని రజినీకాంత్ సూచించాడట. రజినీకాంత్ ఎన్నికల సమయంలో ఎలాంటి ఇన్వాల్ మెంట్ ఇవ్వకూడదనే ఇలా న్యూట్రల్ అవుతున్నాడట. పిఎ రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











