ఆనాటి లుక్ లో అదరగొడుతున్న రజినీ కాంత్

  • September 10, 2018 / 01:38 PM IST

“పిజ్జా” సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్ సినీ పెద్దల దృష్టిని ఆకర్షించిన కార్తిక్ సుబ్బరాజ్.. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో “పెట్ట” అనే సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సిమ్రాన్ నటిస్తోంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ డార్జిలింగ్ లో పూర్తి చేసుకుంది. ఈ మూవీ మోషన్ పోస్టర్ రీసెంట్ గా రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని లక్నో సిటీలో జరుగుతోంది. ఆ షూటింగ్ ఫోటోలు ప్రస్తుతం నెట్లో ప్రత్యక్షమయ్యాయి. ఎవరు లీక్ చేశారో బయటికి రాలేదు కానీ ఈ ఫొటోల్లో రజినీ కాంత్ ఎరుపు రంగు కుర్తా ధరించి మెడలో నీలం రంగు స్కార్ఫ్ తో సూపర్ గా ఉన్నారు.

ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అలర్ట్ అయిన “పెట్ట” టీమ్ మొబైల్ ఫోన్స్ ను  షూటింగ్ లొకేషన్ లోకి తీసుకురాకూడదని కఠిన నిర్ణయం తీసుకుంది. మరోవైపు రజనీకాంత్ కు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 25 మంది పోలీసులతో భారీ సెక్యూరిటీ కల్పించింది. ఈమధ్య కాలంలో షూటింగ్ సజావుగా జరగనివ్వకుండా కొంతమంది జనాలు అడ్డుపడుతుండడంతో అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం ఇలా ముందుజాగ్రత్త తీసుకుందని సమాచారం. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus