RRR Making Video: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మేకింగ్‌లో ఇది గమనించారా?

‘ఆర్‌ఆర్ఆర్‌’ మేకింగ్‌ వీడియో చూశారా… ఏదో ప్రశ్న అడగడం కానీ! ఆ సినిమా మేకింగ్‌ వీడియో చూడని సినిమా ప్రేక్షకులు, పాఠకుడు ఉంటాడా చెప్పండి. అందులో మీరూ చాలా విషయాలు గమనించి ఉంటారు. అందులో ఓ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ మీ కోసం. రోర్‌ ఆఫ్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరుతో విడుదల చేసిన మేకింగ్‌ వీడియో 108 సెకన్ల నిడివి ఉంది. అందులో తొలుత కనిపించింది… మొత్తంగా హైలైట్‌ అయ్యింది ఎవరు అంటే… రాజమౌళి అనే చెప్పాలి. ఇదే మేం చెప్పే పాయింట్‌. వివరాల్లోకి వెళ్తే…

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మేకింగ్‌ వీడియోలో హీరోల ఎంట్రీ 40 సెకన్ల తర్వాతే ఉంటుంది. అంటే 40 శాతం వీడియో అయ్యాక కానీ హీరోలు కనిపించరు. అప్పటివరకు కనిపించేది, మెరుపు మెరిపించేది దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళినే. దానికీ ఓ కారణం ఉంది. అదే ఈ సినిమాను బాలీవుడ్‌ రేంజిలో లేపాలి అంటే… ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌తో అంత ఈజీ కాదు. ఎందుకంటే వీరికి అక్కడ మార్కెట్‌ లేదు. దీంతో రాజమౌళిని చూపించే మార్కెట్‌ చేసుకోవాలి. చేసింది కూడా అదే.

అందుకే మేకింగ్‌ వీడియో విషయంలో… రాజమౌళినే హైలైట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. వీడియో 12వ సెకనులోనే జక్కన్న ఎంట్రీ ఇచ్చాడు. అంతకుముందు 11 సెకన్లు తన విజన్‌ కనిపిస్తే… ఆ తర్వాత తన వర్క్‌ కనిపిస్తుంది. అయితే ఆయన ఈ ఎలివేషన్‌కు అర్హుడే అనేది అర్థమవుతుంది. సినిమా సేలింగ్‌ పాయింట్స్‌లో రాజమౌళి కీలకం అనేది అందరూ చెప్పే మాటే. ఆ మాత్రం చూపిస్తే కదా… సినిమా ఎక్కేది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus