పోర్న్ స్టార్ టర్నడ్ యాక్టర్ సన్నీలియోన్ బాలీవుడ్ లో అడుగిడడంపై అందరికంటే ఎక్కువగా బాధపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అందరూ చెప్పే పేరు రాఖీ సావంత్. “ఆమె ఎంట్రీతో ఇండస్ట్రీ నాశనం అయిపోయింది, ఇక నుంచి బాలీవుడ్ ను అందరూ పోర్ణ్ ఇండస్ట్రీలా చూస్తారు, వెనక్కి వెళ్లిపో సన్నీలియోన్” అంటూ నినాదాలు చేస్తూ నానా రచ్చ చేసింది రాఖీ సావంత్.
లైవ్ షోస్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ఎక్కడ కుదిరితే అక్కడ సన్నీలియోన్ ను ఎండగట్టడానికి విశ్వప్రయత్నాలు చేసింది. అయితే.. రాఖీసావంత్ ను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదనుకోండి. మరి ఇంత రచ్చ చేసిన రాఖీసావంత్ ఉన్నట్లుండి “సారీ సన్నీ నిన్ను తప్పుగా అర్ధం చేసుకొన్నాను, క్షమించు” అని చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. ఉన్నట్లుంది రాఖీలో ఏం మార్పు వచ్చిందా అని షాక్ అవుతున్నారు బాలీవుడ్ జనాలు.