ఈమాత్రం సరిపోదు బెల్లంకొండ..!

ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్ళు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకూ సరైన హిట్టందుకోలేకపోయాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ‘అల్లుడు శీను’ ‘జయ జానకి నాయక’ వంటి సినిమాలు పర్వాలేదనిపించినా అవి డైరెక్టర్ల అకౌంట్ లోకి వెళ్ళిపోయాయి. ఆ తరువాత చేసిన ‘సాక్ష్యం’ ‘కవచం’ ‘సీత’ వంటి చిత్రాలు కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో ఎలాగైనా హిట్టందుకోవాలని .. తమిళంలో సూపర్ హిట్టయిన ‘రాట్ససన్’ రీమేక్ ను ఎంచుకున్నాడు. ‘రైడ్’ ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 2 న (రేపు) విడుదలయ్యింది. మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎట్టకేలకు బెల్లంకొండ ఓ హిట్టు కొట్టాడని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెగకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ ‘రాక్షసుడు’ చిత్రం డీసెంట్ ఓపెనింగ్స్ నే సాధించింది.

‘రాక్షసుడు’ మొదటి రోజు ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 0.63 కోట్లు
సీడెడ్ – 0.30 కోట్లు
వైజాగ్ – 0.34 కోట్లు

ఈస్ట్ – 0.14 కోట్లు
వెస్ట్ – 0.13 కోట్లు
కృష్ణా – 0.13 కోట్లు

గుంటూరు – 0.23 కోట్లు
నెల్లూరు – 0.06 కోట్లు
———————————————————
నైజాం + ఏపీ (టోటల్) – 1.96 కోట్లు
————————————————————-

మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది కాబట్టి… ఈవెనింగ్ షోస్ నుండీ హౌస్ ఫుల్స్ పడ్డాయి. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రెండు, మూడు రోజుల్లో గట్టిగా రాబట్టాల్సి ఉంది. బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. బెల్లంకొండని వర్షాలు కాస్త కరుణిస్తే… మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus