‘రాక్షసుడు’ ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు ..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం ‘రాక్షసుడు’. తమిళంలో సూపర్ హిట్టయిన ‘రాట్ససన్’ చిత్రానికి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ‘రైడ్’ ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 2 న (రేపు) విడుదలయ్యి.. ఇప్పటికి రెండు వారాలు పూర్తిచేసుకుంది. మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం…. మంచి రివ్యూలను కూడా సాధించింది. సూపర్ హిట్ టాకైతే ఉంది కానీ… కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదనే చెప్పాలి.

‘రాక్షసుడు’ రెండు వారాల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 3.92 కోట్లు
సీడెడ్ – 1.40 కోట్లు
వైజాగ్ – 1.81 కోట్లు


ఈస్ట్ – 0.88 కోట్లు
వెస్ట్ – 0.64 కోట్లు
కృష్ణా – 0.85 కోట్లు


గుంటూరు – 0.85 కోట్లు
నెల్లూరు – 0.32 కోట్లు
———————————————————
నైజాం + ఏపీ (టోటల్) – 10.67 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 0.75 కోట్లు


ఓవర్సీస్ – 0.35 కోట్లు
————————————————————-
వరల్డ్ వైడ్ (టోటల్) – 11.77 కోట్లు( షేర్)
————————————————————–

‘రాక్షసుడు’ చిత్రానికి 16 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రెండు వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 11.77 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 5 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. కొత్త సినిమాలు రావడంతో ‘రాక్షసుడు’ కి దెబ్బ పడింది. ప్లాప్ హీరో.. ప్లాప్ డైరెక్టర్ కాంబినేషన్ వల్ల సూపర్ హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లు రావట్లేదు. కనీసం ఈ చిత్రం బెల్లంకొండ డిజాస్టర్ చిత్రాలలో ఒకటైన ‘సాక్ష్యం’ కలెక్షన్లను అయినా అధిగమిస్తుందా అనే అనుమానం కలుగుతుంది. అయితే థియేట్రికల్ పరంగా ఎలా ఉన్నా.. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ రేట్లకు అమ్ముడవ్వడంతో ‘రాక్షసుడు’ నిర్మాతకు మాత్రం లాభాలు తెచ్చిపెట్టిందనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus