Rakshitha: ‘కేడీ’ పాట వివాదం.. మాజీ హీరోయిన్‌ రక్షిత సుదీర్ఘ పోస్ట్‌.. ఏం రాశారంటే?

సినిమా పాటల్లో అసభ్యకర పదాలు, స్టెప్పులు కొత్తేమీ కాదు.. గతంలో చాలా సినిమాల్లో ఇలాంటి పరిస్థితులు చూశాం. అయితే పదాల విషయంలో డబుల్‌ మీనింగ్‌ ఉండేలా చూసుకొని జాగ్రత్తపడతారు. స్టెప్పుల విషయంలో దొరికిపోతారు. ఈ క్రమంలో పాటలోని పదాలు మార్చిన సందర్భాలు ఉన్నాయి. రీసెంట్‌ టైమ్స్‌లో లేదు కానీ కొన్నేళ్ల క్రితం ‘ఆర్య 2’ సినిమాలో ఓ పాట మార్చారు. అయితే పాట వచ్చిన చాలా రోజులకు ఆ మార్పులు జరిగాయి. ఇప్పుడు ‘కేడీ: ది డెవిల్‌’ విషయంలో వివాదం రావడం, మార్పులకు ఆదేశం ఇవ్వడం వెంటనే జరిగిపోయాయి.

Rakshitha

ఆ పాట వివాదం నేపథ్యంలో దర్శకుడు ప్రేమ్‌ భార్య, మాజీ కథానాయిక రక్షిత సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. నేను అన్నీ చూస్తున్నాను. చాలామంది నన్ను రకరకాల పోస్ట్‌లలో ట్యాగ్ చేస్తున్నారు. ఈ పాట విషయంలో నా వ్యక్తిగత అభిప్రాయం పక్కనపెడితే.. గతంలో ‘పీలింగ్స్’, ‘డ్రీమమ్ వేకపమ్’, ‘చోళీ కే పీచే క్యా హై’ వంటి పాటలు వచ్చినప్పుడు అవి సాధారణంగానే అనిపించాయిగా. శృంగారమే ప్రధానాంశంగా సినిమాలు వచ్చినప్పుడు ఎవరికీ ఇబ్బంది కలగలేదు. కానీ ఈ పాట విషయంలో ఇంత వివాదం ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు.

అలా అని నేను ఆ పాటను సమర్థించడం లేదు, కానీ మా సినిమాకు జరిగిన వివక్షను అర్థం చేసుకోవాలని ఈ పోస్ట్‌ పెడుతున్నాను. ఒక్క పాట సరిగ్గా లేనంత మాత్రాన ఆయన చెడ్డ రచయిత అయిపోరు. అలా అని ఇదంతా కావాలని చేస్తున్నారని అనడం లేదు. కొన్ని సినిమాలు ఆడనంత మాత్రాన ఆయనను మంచి దర్శకుడు కాదు అని అనలేం కదా. ఆయనను ప్రశ్నించే హక్కు మీకు ఉంది. ఎందుకు ఇలా చేశారని అడగవచ్చు. కానీ, ఆయనను దూషించే హక్కు ఎవరికీ లేదు అని భర్త ప్రేమ్‌ని ఉద్దేశించి రక్షిత ఆ పోస్ట్‌ పెట్టారు.

రాబోయే కొన్ని రోజుల్లో ఈ వివాదం అంతా సర్దుకుంటుందనే నమ్మకం ఉంది. మాకు కొంచెం సమయం ఇవ్వండి. మాకు సపోర్ట్‌ చేస్తున్నవారందరికీ ధన్యవాదాలు. నేను, ప్రేమ్ ధైర్యంగా ఉన్నాం. ‘కేడీ’ సినిమా మాకు బిడ్డ లాంటిది. చివరికి మేం సరైన పనే చేస్తాం’’ అని రక్షిత తన సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొన్నారు. ధ్రువ్‌ సర్జా కథానాయకుడిగా రూపొందుతున్న ఈ సినిమాలో సంజయ్‌ దత్‌, నోరా ఫతేహీ మీద ఓ ఐటెమ్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. ఆ పాట హిందీ లిరిక్స్‌ విషయంలోనే ఇప్పుడు వివాదం జరుగుతోంది.

 అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus