ఎన్నిసార్లు ఇవ్వాలి సెల్ఫీ : రకుల్ ప్రీత్

తాజాగా కార్తీ హీరోగా వచ్చిన ‘దేవ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రకుల్. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా తన సొంతంగా ప్రమోషన్లు నిర్వహించుకుంటుందని మొన్నామధ్య వార్తలొచ్చాయి. ఇదిలా ఉండగా ఇటీవల రకుల్ ఎయిర్ పోర్ట్ లో ఉన్నప్పుడు కొందరు సెల్ఫీ అంటూ వచ్చారంట. ఎంతో ఓపికాగా వారందరితోనూ సెల్ఫీలు ఇచ్చిందట. అయితే ఈ క్రమంలో ఓ వ్యక్తి ‘వన్ మరి సెల్ఫీ’ అంటూ రకుల్ వద్దకు మళ్ళీ వచ్చాడంట. దీంతో రకుల్.. ఒకసారి సరిపోదా..? ఎన్ని సార్లు వాస్తవ్ అంటూ ఆ వ్యక్తి పై మండిపడిందట. ఆ వెంటనే అక్కడి నుండీ రకుల్ వెళ్ళిపోయిందట.

సెలబ్రెటీలు ఇలా ఇబ్బందులు పడటం సాధారణ విషయమే. హీరో లేదా హీరోయిన్లు దూరంగా ఉన్నప్పుడు సెల్ఫీలు తీసుకున్న వారేమి పట్టించుకోరు. అయితే సెల్ఫీలు పేరుతో దగ్గరకొచ్చి మీదపడిపోవడం వంటివి వారిని ఇబ్బందికి గురి చేస్తుంటాయి. ఈ కోవలో గతంలో చాలా మంది సెల్ఫీల విషయంలో ఇబ్బందికి గురయ్యారు. కోలీవుడ్ హీరో సూర్య తండ్రి శివ కుమార్ వద్దకు సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన వ్యక్తి మొబైల్ ఫోన్ విసిరినందుకు పెద్ద దుమారం చోటు చేసుకుంది. ఇక నందమూరి బాలకృష్ణ అయితే అభిమానుల పై చెయ్యి చేసుకునే వరకూ వెళ్ళింది. ‘భరత్ అనే నేను’ సక్సెస్ మీట్లో కే.టి.ఆర్ ఎదురుగా ప్రస్తావిస్తూ.. అభిమానులు సెల్ఫీలు అడగడం తప్పేమీ కాదు.. కానీ ఆ సందర్భాన్ని బట్టి ప్రవర్తించాలని దర్శకుడు కొరటాల శివ చెప్పుకొచ్చాడు. అలా సందర్భానుసారం ప్రవర్థించకపోతే అటు సెలెబ్రెటీలకు.. ఇటు సెల్ఫీలు అడిగే వారికి అవమానాలు తప్పవు అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus