దేశంలో సినిమా అంటే బాలీవుడ్ అనే పరిస్థితి ఉండేది. విదేశాల్లో ఇండియా అనగానే బాలీవుడ్ అనేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. సౌత్ సినిమాల పవర్ ఏంటో అందరూ చూస్తున్నారు. బాలీవుడ్ కూడా అందుకే మన సినిమాలవైపు ఓరగా చూస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా మన సినిమాను అక్కడ తీసి విజయం సాధించాలని చూస్తోంది. అయితే అది కూడా అక్కడ సరిగ్గా వర్కౌట్ కావడం లేదు. ఏదో మిస్ అవుతోంది. తాజాగా అలా వెళ్లి పరాజయం పాలైన సినిమా ‘కట్ పుత్లీ’. ‘రాచ్చసన్’, ‘రాక్షసుడు’ సినిమాలకు రీమేక్ ఇది.
ఈ సినిమా ఫలితం గురించి పక్కనపెడితే, సీరియస్గా సాగే థ్రిల్లర్లో రొమాన్స్ ఎందుకు? అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇవే విషయాన్ని ఆ సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దగ్గరే ప్రస్తావించారు మీడియా మిత్రులు. దీంతో ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్గా మారింది. సెప్టెంబర్ 2 నుండి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ‘కట్ పుత్లీ’ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. సీరియల్ కిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో… ప్రధాన పాత్రధారుల మధ్య రొమాన్స్ చూపించడం ఎందుకు? అని కొందరు విరుస్తున్నారు.
‘‘సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకుల్లో ఒక వర్గం రొమాన్స్, సాంగ్స్, డ్యాన్సులు చూడటానికి ఇష్టపడతారు. కుటుంబం మొత్తం కలసి చూసే సినిమాగా ‘కట్ పుత్లీ’ని రూపొందించాం’’ అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది రకుల్ ప్రీత్. దాంతోపాటు ‘‘భారతీయ సినిమాల్లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అంతెందుకు తెలుగు సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయంటే ఆ సినిమాల్లో అన్నిరకాల భావోద్వేగాలు ఉండటం ఓ కారణం’’ అని చెప్పింది రకుల్.
‘‘గత మూడేళ్లుగా అందరూ కష్టంగా కాలాన్ని గడిపారు. ఇప్పుడు సినిమాల నుండి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. అందుకే సినిమా మొత్తం థ్రిల్లింగ్ అంశాలతోనే రూపొందించకుండా మధ్య మధ్యలో అలాంటి సన్నివేశాలు ఉంటే ఆదరిస్తారు’’ అని రకుల్ వివరించే ప్రయత్నం చేసింది. ఆమె మాటలు విని ఇప్పటికిప్పుడు సినిమా ఫలితం మారే పరిస్థితి లేదు. కానీ ప్రేక్షకులు ఇదే అనుకుంటున్నారా? అనేదే ఇక్కడ ప్రశ్న.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!