Rakul Preet: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉన్నాడా? క్లారిటీ ఇదే!

సినిమా నిర్మించాలి అంటే కచ్చితంగా అప్పు చేయాలి అంటారు. అతను ఎంత పెద్ద నిర్మాత అయినా అప్పుడు అనేది కచ్చితంగా ఉండే విషయం. ఈ విషయాన్ని చాలా మంది నిర్మాతలు గతంలో చెప్పారు కూడా. ఆస్తులు తనఖా పెట్టి మరీ ఆ డబ్బులు తెస్తుంటారు. ఇక సినిమా రిలీజ్‌ అయ్యాక బాగుంటే ఆ డబ్బులు తిరిగొస్తాయి. అప్పులు తీర్చేసి మళ్లీ కొత్త సినిమా గురించి ఆలోచిస్తారు.

Rakul Preet

ఒకవేళ సినిమా ఫలితం తేడా కొడితే ఏదో విధంగా డబ్బులు సర్దుబాటు చేసి చెల్లిస్తారు. ఈ ప్రాసెస్‌లో ఏమన్నా అడ్డంకులు వస్తే మొత్తం పరిస్థితి మారిపోతుంది. తనఖా పెట్టిన ఆస్తులు అమ్మేసుకోవాల్సి వస్తుంది. అంత ఆస్తులు లేకపోతే దివాళా తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్‌ గురించే గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో ఓ నిర్మాత గురించి ఇదే చర్చ జరుగుతోంది. ఆయనే ప్రముఖ కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet) భర్త, ప్రముఖ నిర్మాత జాకీ భగ్నాని.

బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ‌డే మియా.. ఛోటే మియా’. ఈ సినిమా అనుకున్న ఫలితం అందుకోలేకపోయింది. ‘బడే మియా చోటే మియా’ సినిమా కోసం తనఖా పెట్టిన నా ఆఫీసు జూహు కార్యాలయాన్ని తిరిగి సొంతం చేసుకున్నాను. గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలిచిన భవనం అదే. నేను దివాలా తీయడం వల్ల ఆ భవనాన్ని అమ్మేయాల్సి వచ్చిందని, నా వద్ద ఆహారం కొనడానికి కూడా డబ్బులు లేవని రకరకాల పుకార్లు పుట్టిస్తున్నారు.

కొందరైతే నేను ఎక్కడికో పారిపోయానని ప్రచారం చేస్తున్నారు. ఈ రూమర్స్‌ విషయంలో నేను ఎవరినీ నిందించను. అవి నిజం కూడా కావు అని చెప్పారు జాకీ. సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘బడే మియా చోటే మియా’ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర రూ.102 కోట్లు వసూలుచేసింది.

రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus