Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

బాలీవుడ్‌లో రామాయణం నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోందని, అందులో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రావణుడిగా యశ్‌ నటిస్తున్నారని తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. అందులో నటుల్ని చూపించకపోయినా.. యానిమేషన్‌ బొమ్మలతో కాన్సెప్ట్‌ వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సినిమా బడ్జెట్‌ భారీగా ఉంటుంది అనే మాటలు నిజమని తేలిపోయాయి. అయితే ముందుగా అనుకున్న బడ్జెట్‌ కంటే బాగా ఎక్కువైంది అని సమాచారం.

Ramayana

బాలీవుడ్‌ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం అయితే ‘రామాయణ’ పార్ట్‌ 1 సినిమాకు రూ.850 కోట్లు ఖర్చవుతోంది అని చెబుతున్నారు. అంతేకాదు సినిమా రెండో పార్టుకి సుమారు రూ. 1000 కోట్లు వరకు ఖర్చు చేయొచ్చని సమాచారం. గతంలో రెండు భాగాలు కలిపి రూ.1500 కోట్లు నుండి రూ.1600 కోట్లు ఖర్చు అవుతుందని తొలుత వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు లెక్క చూస్తుంటే సుమారు రూ. 1800 కోట్లు వరకు ఖర్చవుతుంది అని అంటున్నారు.

ప్రస్తుతం సిద్ధం చేస్తున్న తొలి భాగం కోసం ఎక్కువ సెట్స్‌ వేశారని, వాటినే రెండో పార్టుకు కూడా వాడతారు కాబట్టి కొత్త ఖర్చు ఉండదని అంటున్నారు. అయితే రెండో పార్టులో రామ – రావణ యుద్ధం జరుగుతుంది కాబట్టి దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెబుతున్నారు. వార్తలు వస్తున్నట్లు ఈ బడ్జెట్‌ నిజమైతే మన దేశంలో తెరకెక్కుతున్న / తెరకెక్కనున్న అత్యంత ఖరీధైన చిత్రంగా ‘రామాయణ’ సినిమా చరిత్ర సృష్టిస్తుంది. ఈ సినిమా మొదటి పార్ట్‌ 2026 సంవత్సరం దీపావళికి, రెండోది 2027 సంవత్సరం దీపావళికి విడుదల చేయనున్నారు.

రాముడి కథ అంటే దేశమే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన చిత్రమవుతుంది. ‘ఆదిపురుష్‌’ సినిమాలా కాకుండా పద్ధతిగా, పక్కాగా తీస్తే రిపీట్‌ ఆడియన్స్‌ పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి పెట్టిన ఖర్చుకు తగ్గ డబ్బులు కూడా రావడం కష్టం కాదు.

‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus