మెగాహీరోకి హ్యాండ్ ఇచ్చిన రకుల్!

మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నారనే వార్తలు నిన్నటినుండి వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం రకుల్, సాయి ధరమ్ తేజ్ సినిమాను వదులుకున్నట్లుగా టాక్. రకుల్ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘ధృవ’ సినిమాలో నటిస్తోంది.

అది కాకుండా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో ఒక సినిమా అలానే గోపిచంద్-సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో వస్తోన్న మరో సినిమాలో నటించడానికి అంగీకరించింది. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకొంది. రకుల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. అసలు విషయంలోకి వస్తే..  రకుల్ కి సడెన్ గా మహేష్ సినిమాలో అవకాశం రావడంతో తేజు సినిమా కోసం అనుకూన్న డేట్స్ ను మహేష్ కి ఇచ్చేయాలనే ప్లాన్ లో ఉందట. ఈ విషయం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus