మహేష్ బాబు చిత్రంలో తన పాత్ర గురించి చెప్పిన ఫిట్ బ్యూటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో  ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో తాను చేస్తున్న పాత్ర తన రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉంటుందని చెప్పింది. ఒక పనిపై పూర్తిగా అవగాహన లేకపోయినా, ఆ పని చేయడం.. చివరికి అది ఫెయిల్ అవడం.. ఇతరులకు ఇబ్బంది కలిగించడం..

అలా మళ్లీ మళ్లీ  ప్రిన్స్ చిత్రంలో తన పాత్ర చేస్తుంటుందని వెల్లడించింది. అయితే ఈ పనులు ప్రేక్షకులకు నవ్వులు పంచుతుందని ఫిట్ బ్యూటీ పేర్కొంది. రీసెంట్ గా ఆమె ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తాను మోడలింగ్ లో ఉన్నప్పుడు మురుగదాస్ తో అపాయింట్మెంట్ కోసం పంపిన మెసేజ్ గురించి వివరించింది. “సార్. దిస్ ఈస్  రకుల్,  మోడల్ ని. మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను” అనే మెసేజ్ ని రెండు రోజుల క్రితం తాను డైరక్టర్ కి చూపించి నవ్వుకున్నట్లు తెలిపింది. అందుకు మురుగ దాస్ కూడా అప్పటి సంగతులు గుర్తుచేసుకున్నారని రకుల్ చెప్పింది.

“నేను విజయ్ తో తుపాకీ సినిమా తీసేటప్పుడు నిన్నే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాను. కానీ మా టీమ్ వాళ్ళు నువ్వు కొత్త అని చెప్పడంతో కాజల్ ని ఎంపిక చేసాను” అని మురుగదాస్ చెప్పిన విషయాన్నీ రకుల్ మీడియాతో పంచుకుంది. అప్పుడు కలవలేక పోయినా సూపర్ స్టార్ సినిమా తో వీరిద్దరూ కలవడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus