‘కెరటం’ అనే చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమయ్యింది రకుల్ ప్రీత్ సింగ్. తరువాత ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ‘లౌక్యం’ వంటి చిత్రాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని… వరుసగా రాంచరణ్ ,అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది. అయితే యువ హీరోయిన్ల ధాటికి రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగులో సరైన అవకాశాలు రావడం లేదు. దీంతో తమిళ, హిందీ భాషల్లో అడపాదడపా నటిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం త్వరలోనే రకుల్ ఐటెం గాళ్ గా మారబోతుందట. నేచురల్ స్టార్ నాని – విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో రకుల్ ఓ ఐటెం సాంగ్ చేయబోతుందట. అయితే ఈ సాంగ్ కోసం రకుల్ కి భారీ గానే పారితోషికాన్ని చెల్లిస్తున్నారంట నిర్మాతలు. ఈ చిత్రంలో కీలక సమయంలో వచ్చే ఈ ఐటెం సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట. ప్రస్తుతం తెలుగులో ఆఫర్లేమీ లేకపోవడంతో రకుల్ కూడా.. ఈ ఐటెం సాంగ్ చేయడానికి ఓకే చెప్పేసిందని తెలుస్తుంది. అనిరుథ్ సంగీత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాల్ని జరుపుకుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక ఆరుళ్ అనే మలయాళీ హీరోయిన్ ని ఎంపిక చేశారట.