బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ ఫీవర్ మొదలైంది. ఈసారి ‘సిలబస్ మార్చేశాం’ అంటూ నాగార్జున ఇస్తున్న హింట్లు, కంటెస్టెంట్ల ఎంపికలో పాటిస్తున్న ప్రైవసీ షోపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి. నిర్వాహకులు ఎంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నా, ఇద్దరి పేర్లు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఫ్లోరా సైని అలియాస్ ఆశా సైని, ‘జానీ మాస్టర్’ అసిస్టెంట్ శ్వేత వెర్మ వంటి వారు ఫిక్స్ అయినట్టు టాక్ నడుస్తుంది.
అలాగే మరికొంతమంది క్రేజీ కంటెస్టెంట్స్ ను ‘బిగ్ బాస్ 9’ కోసం తీసుకుంటున్నారు. వారిలో ‘జయం’ మూవీ కమెడియన్ సుమన్ శెట్టి, ‘బొంబాయికి రాను’ సింగర్ రాము రాథోడ్ కూడా ఉన్నట్టు టాక్ .
గత సీజన్ (సీజన్ 8)లో పెద్దగా పరిచయం లేని ముఖాలను తీసుకురావడం షోకు మైనస్‌గా మారింది. ఆ చేదు అనుభవం రిపీట్ కాకుండా, ఈసారి జనాలకు బాగా తెలిసిన, పాపులర్ ముఖాలనే హౌస్‌లోకి తీసుకురావాలని నిర్వాహకులు పక్కా ప్లాన్‌తో ఉన్నారు. అందుకే, సుమన్ శెట్టి, రాము రాథోడ్ వంటి ఎంటర్‌టైనర్లను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.‘జయం’ సినిమాతో బెస్ట్ కమెడియన్‌గా నంది అవార్డు అందుకున్న సుమన్ శెట్టి ఎంట్రీ దాదాపు ఖాయమైనట్లు సమాచారం. సుమన్ తనదైన కామెడీ టైమింగ్‌తో హౌస్‌లో నవ్వులు పూయించడం గ్యారెంటీ. అలాగే, ‘రాను బొంబాయికి రాను’ పాటతో యూట్యూబ్‌ను షేక్ చేసిన జానపద గాయకుడు రాము రాథోడ్ కూడా ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో తన పాటలతో సందడి చేయనున్నాడట.వీరితో పాటు, ‘లక్స్ పాప’ ఆశా షైనీ (ఫ్లోరా సైని), జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నటుడు భరణి, తేజస్విని గౌడ, బ్రహ్మముడి ఫేమ్ దీపిక రంగరాజు వంటి మరికొందరు పాపులర్ సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి పాపులర్ ఫేసెస్‌తో షో TRP రేటింగ్స్ బద్దలుకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.