తెలుగు సినిమా రేంజ్ పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంటోంది. వచ్చే 5ఏళ్ళలో టాలీవుడ్ నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు దండెత్తనున్నాయి. ‘కల్కి 2’ ‘సలార్ 2’ ‘డ్రాగన్’ వంటి చిత్రాలు తెలుగు సినిమాను మరో మెట్టు పైకెక్కించనున్నాయి అని అంతా నమ్ముతున్నారు. ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఓ అంచనా ఉంది.
అయితే వీటిని మించి రెండు సినిమాలపై అంతర్జాతీయ స్థాయిలో ఫోకస్ ఉంది. కానీ అవి ఎప్పుడు విడుదల అవుతాయన్నది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు.దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కనున్న ‘SSMB29’ పై భారతీయ చిత్ర పరిశ్రమతో పాటు హాలీవుడ్ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఆస్కార్ అవార్డు కొట్టి టాలీవుడ్ స్థాయిని మరింత పెంచిన జక్కన్న చేస్తున్న సినిమా కావడమే దీనికి కారణం.
దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్, నటులు కూడా ఈ సినిమాకు పనిచేస్తున్నట్లు చాలా కాలంగా టాక్ నడుస్తుంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌ను ఎస్ఎస్ఎంబీ 29 కోసం వినియోగించనున్నారు. దాంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది చెప్పలేకపోతున్నారు. 2027 అనే మాట వినిపిస్తోంది కానీ ఎంత వరకు కరెక్ట్ అవుతుందన్నది చెప్పలేం.
ఇక రెండో సినిమా విషయానికి వస్తే.. అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్. ఈ సినిమాను దాదాపు 800 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లుగా ఇండస్ట్రీ టాక్. హాలీవుడ్ రేంజులో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అలాగే ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రముఖులు పనిచేస్తున్నారని, హాలీవుడ్‌లోని ఓ స్టూడియోను కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించేలా సన్ పిక్చర్స్ చర్చలు జరుపుతోందని ప్రచారం వినిపిస్తుంది. ఎస్ఎస్ఎంబీ 29 మాదిరిగానే ఈ సినిమా కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది క్లారిటీ లేదు. ఈ సినిమా కోసం బన్నీ రెండేళ్లకు పైగా వెచ్చించాల్సి వస్తుందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఎస్ఎస్ఎంబీ 29, అట్లీ – అల్లు అర్జున్ మూవీ ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు. అదే కనుక జరిగితే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ గ్యారెంటీ అనే చెప్పాలి.