టాలీవుడ్‌లోని టాప్ ప్రొడ్యూసర్స్‌లో సూర్యదేవర నాగవంశీ ఒకరు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్టార్ హీరోలతో హిట్ సినిమాలు తీశారు. సినిమాలతో పాటు ఇతర భాషల నుంచి డబ్ అయ్యే సినిమాల హక్కులను కొనుగోలు చేసి వాటిని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌లు నటించిన ‘వార్ 2’ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ రిలీజ్ చేశారు.
ఆంధ్ర, నైజాం హక్కులు ఏకంగా రూ.80 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే వార్ 2 బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.ఈ సినిమా ఫ్లాప్ కావడంతో నాగవంశీ పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారని చిత్రసీమలో గాసిప్స్ వినిపించాయి. అంతేకాదు.. నాగవంశీ ఇకపై సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయరని కూడా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపించాయి. అయితే వీటన్నింటిని పటాపంచలు చేశారు సూర్యదేవర నాగవంశీ. ఎప్పటిలాగే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ సినిమాలు విడుదల చేస్తున్నారు.
మలయాళంలో తెరకెక్కిన కొత్త లోక చాప్టర్ 1: చంద్ర సినిమాను నాగవంశీ తెలుగులో రిలీజ్ చేశారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ నటించారు. సూపర్ ఉమెన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ మంచి బుకింగ్స్ అందుకుంటోంది. మలయాళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘కొత్త లోక చాప్టర్ 1 :చంద్ర’ ఘన విజయం సాధిస్తుందని, ఈసారి నాగవంశీకి హిట్ గ్యారెంటీ అని విశ్లేషకులు చెబుతున్నారు. వార్ 2 వంటి భారీ ఫెయిల్యూర్ తో ఢీలా పడ్డ నాగవంశీకి ‘కొత్త లోక’ కొంత రిలీఫ్ ఇచ్చినట్టే అని చెప్పాలి.