యంగ్ హీరోతో సినిమా సైన్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

“స్పైడర్” లాంటి డిజాస్టర్ తర్వాత పాపం రకుల్ ని మన తెలుగు దర్శకనిర్మాతలు, కథానాయకులు పట్టించుకోలేదో లేక, ఆమె తమిళంలో బిజీ అయిపోవడం వల్ల తెలుగు సినిమా సైన్ చేయలేదో తెలియదు కానీ.. ఏడాదికాలంగా ఆమె ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా సైన్ చేయలేదు. తమిళంలో రెండు, హిందీలో రెండు ప్రొజెక్ట్స్ తో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. “వెంకీ మామా” సినిమా సైన్ చేసినప్పటికీ అది స్పైడర్ సినిమా రిలీజ్ కి ముందే ఫైనల్ అయిన సబ్జెక్ట్. అప్పట్నుంచి రకుల్ ఫ్యాన్స్ అందరూ అమ్మడు మరో తెలుగు సినిమా ఎప్పుడు సైన్ చేస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.

మరి ఇన్నాళ్ళకి తన అభిమానుల మొర ఆలకించ్చిందో లేక ఆమెకు తెలుగులో అదృష్టం వరించిందో తెలియదు కానీ.. నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో రకుల్ కథానాయికగా ఎంపికైంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో రష్మికతో రొమాన్స్ చేయనున్న నితిన్.. ఆ సినిమాతోపాటుగా తెరకెక్కనున్న చిత్రంలో రకుల్ తో జతకడతాడన్నమాట. సో, రకుల్ ఇప్పటినుంచైనా తమిళంతోపాటు తెలుగులోను వరుస సినిమాలు సైన్ చేస్తుందేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus