ఫిట్ నెస్ బ్యూటీ రకుల్ ప్రీతీ సింగ్ చేతినిండా సినిమాలతో దూసుకు పోతోంది. బ్రూస్లీలో ఈ భామ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పక్కన ఆడి పాడింది. ఆ చిత్రం హిట్ కాక పోయినా మరోసారీ చెర్రీతో జత కట్టే అవకాసం దక్కించుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న “ధృవ” సినిమాలో నటిస్తోంది.
ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో నాలుగు రోజుల క్రితం మొదలైంది. తాజా షెడ్యూల్ లో యువ నటుడు నవదీప్ జాయిన్ అయ్యాడు. గురువారం నుంచి రకుల్ కూడా చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ విషయాన్నిరకుల్ ట్విట్టర్ లో వెల్లడించింది. తమిళ్ హిట్ సినిమా “తనీ వరువన్” కు రీమేక్ అయిన ఈ చిత్రంలో అరవింద్ స్వామీ ప్రతి కథానాయకుడిగా చేస్తున్నాడు. ట్రైనీ ఐపీఎస్ అధికారిగా, అథ్లెట్ బాడీతో చరణ్ ఆకట్టుకోనున్నాడు. ఈ సారి రామ్ చరణ్, రకుల్ ప్రీతీ సింగ్ జోడి విజయాన్ని తప్పకుండా అందుకుంటుందని మెగా అభిమానులు ధీమాగా ఉన్నారు.