Rakul Preet: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న రకుల్!

  • January 2, 2024 / 07:58 PM IST

సినీ నటి రకుల్ ప్రీతి సింగ్ ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఈమె సౌత్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ బాలీవుడ్ సినిమాలలోనే బిజీగా గడుపుతున్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమైనటువంటి ఈమె బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీభగ్నాన్ని ప్రేమలో ఉన్నారు. ఇలా వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ వీరి ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇలా ప్రేమ విషయాన్ని తెలియజేయడంతో వీరిద్దరూ స్వేచ్ఛగా వారికి నచ్చిన ప్రదేశాలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇలా గత రెండున్నర సంవత్సరాల నుంచి డేటింగ్ లో ఉన్నటువంటి వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రకుల్ జాకీ ఇద్దరు కూడా ఫిబ్రవరి 22వ తేదీ గోవాలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

ఇక త్వరలోనే వీరి పెళ్లి జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయని ఇందులో భాగంగానే వీరిద్దరూ తమ స్నేహితులకు గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చారని ఈ పార్టీ బ్యాంకాక్ లో ఇచ్చారు అంటూ కూడా తెలుస్తుంది. ఈ విధంగా రకుల్ తన ప్రియుడుతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

అయితే వీరి వివాహం గోవాలో అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరగబోతుందని సమాచారం. ఇలా వీరి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నప్పటికీ రకుల్ (Rakul Preet) మాత్రం ఈ విషయం గురించి ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus