సైన్ చేసిన సినిమా నుంచి బయటికి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్!

ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదుగుతోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో సినిమాలు చేస్తున్న ఈ భామకు కోలీవుడ్ నుంచి కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి. కొంతకాలం క్రితం విశాల్ కి జోడిగా తమిళ చిత్రంలో నటించేందుకు రకుల్ సంతకం చేసింది.

తుప్పరివాలన్ అనే ఈ మూవీ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. అదే సమయంలో తాను ఒప్పుకున్న బోయపాటి శ్రీను చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలకు కొన్ని డేట్లు క్లాష్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ ని పోస్ట్ పోన్ చేయడం వీలుకాదని తుప్పరివాలన్ టీమ్ చెప్పడంతో రకుల్ చేసేది లేక ఈ చిత్రానికి గుడ్ బై చెప్పింది. దీంతో విశాల్ కి కొత్త హీరోయిన్ ని వెతికే పనిలో తుప్పరివాలన్ టీమ్ పడింది.

Dhruva Movie Teaser || Ram Charan ,Rakul Preet, Surender Reddy - Filmyfocus.com

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus