భ్రమరాంబ పాత్రలో మెప్పించిన రకుల్ ప్రీత్ సింగ్!

  • May 27, 2017 / 08:14 AM IST

అచ్చమైన తెలుగు సినిమా “రారండోయ్ వేడుక చూద్దాం” నిన్న విడుదలై అన్ని ఏరియాల్లో సూపర్ టాక్ తెచ్చుకుంది. డైరక్టర్ కల్యాణ్ కృష్ణ  సోగ్గాడే చిన్నినాయనా తర్వాత మళ్ళీ హిట్ కొట్టాడని అందరూ అభినందిస్తున్నారు. నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రకుల్ ఎక్కువ మార్కులు కొట్టేసిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. భ్రమరాంబగా రకుల్ బరువైన పాత్రను చక్కగా పోషించిందని ప్రేక్షకులు అభినందిస్తున్నారు. లంగా, ఓణీలో ఆమె మరింత అందంగా కనిపించిందని చెబుతున్నారు.

చురుకుగా, చలాకీగా కనిపిస్తూ ఆమె భ్రమరాంబ పాత్రకి నిండుతనాన్ని తీసుకొచ్చిందని కితాబిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో బంగార్రాజు అందరి మదిలో నిలిచిపోయినట్లు  “రారండోయ్ వేడుక చూద్దాం” లో భ్రమరాంబ పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మించిన ఈ మూవీ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ కి బలాన్ని చేకూర్చింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus