అతనిపై కొంపంగా ఉన్న ‘రామ్‌చరణ్’

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. మెగా స్టార్ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రామ్‌చరణ్ తండ్రి క్రేజ్ ను వాడుకోకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. డ్యాన్స్ తో మంచి బాడీ ల్యాంగ్వేజ్ తో అభిమానులను అలరిస్తున్నాడు. అయితే వరుస హిట్స్ తో దూసుకుపోతున్న చెర్రీని అనుకోకుండా ‘బ్రూస్ లీ’ సినిమా డిజాస్టర్ పలకరించింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే ఆ కాంబినేషన్ అలాంటింది…స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల, స్టార్ రైటర్స్ కాంబినేషన్ గోపిమోహన్, కోనవెంకట్…అలాగే స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ అందరూ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న వాళ్లే. కానీ ఏం లాభం సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా డిజాస్టర్ తరువాత ఇప్పటి వరకూ రామ్‌చరణ్ దర్శకుడు శ్రీనువైట్ల ని కలవలేదంటా. కానీ చెర్రీని కలిసేందుకు దర్శకుడు శ్రీను వైట్ల చాలా ప్రయత్నాలు చేసాడంట. వ్యక్తిగతంగా కలవాలని చూసినప్పటికీ…..చెర్రీ మాత్రం శ్రీనువైట్లకి డేట్స్ ని ఇవ్వలేదంట. దీంతో శ్రీనువైట్లపై చరణ్ కి చాలా కోపం ఉందని అంటున్నారు. ఇక తప్పంతా మరో పక్క కోనవెంకట్ పైనా రామ్ చరణ్ సీరియస్ గానే ఉన్నాడని టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న సమాచారం. ఏది ఏమైనా….వీరంతా ఎవరికి వారు బిజిగా ఉన్నాం అని చెప్పుకుంటూ…ఎప్పుడూ కలవలేకపోతున్నారు. అది మరి సినిమా వాళ్ళు అంటే!!!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus