చిరంజీవి వారసత్వం నిలబెట్టడం కష్టమే అన్నారు

మెగాస్టార్ నటవారసుడు రామ్ చరణ్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. ఆయనకంటూ ఓ పెద్ద ఫ్యాన్ బేస్,ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు రామ్ చరణ్. దశాబ్దాల పాటు టాలీవుడ్ ని ఏలిన చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంటే అతి పెద్ద భాద్యతే అని చెప్పాలి. ఒకవేళ సక్సెస్ కాలేకపోతే అనేక విమర్శలను ఎదురుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఐతే మొదటి చిత్రం చిరుత లో రామ్ చరణ్ ని చూసిన చాల మంది క్రిటిక్స్ మరియు సగటు ప్రేక్షకులు పెదవి విరిచారు.

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిరుత చిత్రంలో చరణ్ యాక్షన్ మరియు డాన్సుల పరంగా ఒకే అనిపించినా అతని పేస్ కట్ డైలాగ్ డిక్షన్ అంతగా నచ్చలేదు. ఇతను చిరంజీవి నట వారసత్వం నిలబెట్టడం కష్టమే అన్నారు. చరణ్ టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరిగా ఎదుగుతారని ఎవరూ ఊహించలేదు. చిరుత చిత్రంతో ఓ మోస్తరు హిట్ అందుకున్న చరణ్ ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో చేసిన మగధీర చిత్రంతో తానేమిటో నిరూపించుకున్నారు. మగధీర సినిమాలో భైరవగా చరణ్ నటన అందరిని కట్టిపడేసింది.

రెండో చిత్రానికే చరణ్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఇప్పటికీ కొన్ని రికార్డ్స్ మగధీర చిత్రం పేరిట అలాగే ఉన్నాయి. ఇక జంజీర్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ కూడా చరణ్ ఇవ్వడం జరిగింది. రంగస్థలం సినిమాలో చరణ్ నటన తారాస్థాయికి చేరింది. రంగస్థలం చిత్రంతో చరణ్ మరో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. రాజమౌళితో ఆయన చేస్తున్న మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా మూవీగా విడుదలవుతుండగా అనేక కొత్త రికార్డ్స్ నెలకొల్పడం ఖాయం. మొత్తంగా రామ్ చరణ్ మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకొని ఆ విమర్శలకు చెక్ పెట్టాడు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus