మనలో చాలామందికి ఫస్ట్ సంపాదన చాలా ఇంపార్టెంట్ . దాంతో ఏదో ప్రత్యేకమైనది చేస్తూ ఉంటారు . కేవలం మనమే కాదు సినిమా సెలబ్రిటీస్ ప్రముఖ హీరో హీరోయిన్లు కూడా దానికి సంబంధించిన తీపి మెమోరీస్ ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి ఓ విషయాని గుర్తు చేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కోట్ల ఆస్తికి అధిపతి అయినా సరే ఫస్ట్ సంపాదన అంటే ఎంతో ప్రత్యేకమైన చెప్పుకొచ్చాడు రామ్ చరణ్ .
మనకు తెలిసిందే చిరంజీవి కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన రామ్ చరణ్ ఫస్ట్ చిరుత సినిమాతో తనదైన స్టైల్ లో నటించి సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు . చాలా స్టాలిన్ అండ్ మాస్ లుక్స్ లో ఈ సినిమాలో అదరగొట్టేసాడు రామ్ చరణ్ . ఈ సినిమా కోసం చాలానె కష్టపడ్డాడు చరణ్. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ఒక సినిమాకి 100 కోట్లు రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి వచ్చారు .
అయితే ఎంత ఎదిగిన సరే ఒదిగి ఉండాలి అని నేర్చుకున్న (Ram Charan) రాంచరణ్ ఏం చేశాడనే విషయాన్ని రీసెంట్గా ఇంటర్వ్యూలో బయట పెట్టాడు .కాగా తనకి మొదటి నుంచి వాచెస్ అంటే చాలా పిచ్చి అని ..తన దగ్గర డబ్బులు ఎంత ఉన్నా సరే వాచెస్ మీదే పెడతారని చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే తన ఫస్ట్ డబ్బులతో ఎంతో ఇష్టమైన వాచ్ ని కొనుగోలు చేశారని చెప్పుకొచ్చాడు . కాగా ఇదే విషయం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. అంతేకాదు మరీ ముఖ్యంగా హ్యాండ్ వాచెస్ అంటే తనకి చాలా చాలా ఇష్టమని ..
ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ ఒక వాచ్ కొనుక్కొని అయితే వస్తానని చెప్పుకొచ్చాడు .అంతే కాదు తన ఫేవరెట్ వాచ్ ఏంటి అని ప్రశ్నించగా.. ప్రస్తుతం పటేక్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు . అయితే కరోనా టైం లో కొన్నది మాత్రం తన బెస్ట్ వాచ్ ను తెలియజేశాడు. ఆ పార్సెల్ ఇంటికి వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాడట . మిలిటరీ కలర్ లో ఉన్న ఆ వాచ్ తనకి ఎంతో ఇష్టమని గుర్తు చేసుకున్నాడు రామ్ చరణ్ . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!