Ram Charan: ‘అన్‌స్టాపబుల్‌’లో చరణ్‌.. లకారంపైనే షర్ట్‌ వేసుకున్న చరణ్‌!

మామూలుగా అయితే హీరోయిన్లు ధరించే డ్రెస్సుల రేట్ల గురించి మనం ఎక్కువగా మాట్లాడుతుంటాం. లక్షల్లో ఖర్చు పెట్టి తయారు చేయించారని, వందల గంటలు దాని కోసం కష్టపడ్డారు అని ఏవేవో తెలుస్తుంటాయి. ఇలాంటి వార్తలు హీరోల విషయంలో తక్కువగా వస్తుంటాయి. అయితే రీసెంట్‌ టైమ్స్‌లో కథానాయకుల కథలు కూడా వింటున్నాం. అలాంటిదే ఒకటి రామ్‌చరణ్‌ గురించి బయటకు వచ్చింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ షో కొత్త ఎపిసోడ్‌ షూటింగ్‌ ఇటీవల జరిగింది.

Ram Charan

ఈ ఎపిసోడ్‌కి ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)  రామ్‌చరణ్‌ (Ram Charan)   గెస్ట్‌గా వచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి ఆల్‌రెడీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ షోకి చరణ్‌ వేసుకొచ్చిన టీషర్ట్‌ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. దానికి కారణం ఆ టీషర్ట్‌ ధర. ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌ బోన్స్ హూడీ వేసుకొని వచ్చాడు. అమిరి కంపెనీకి చెందిన లాంగ్‌ స్లీవ్స్ టీషర్ట్ ధర అక్షరాల రూ.లక్షా 30 వేలు. కంపెనీ అఫీషియల్‌ వెబ్‌సైట్‌లో ఈ రేటు ఉంటే..

మరికొన్ని వెబ్‌సైట్లలో రూ. 90 వేలు ధరలో దొరుకుతోంది. దీంతో చరణ్‌ కూడా కాస్ట్‌లీ టీ షర్ట్‌లు ఇష్టపడే హీరోల జాబితాలో ఉన్నవాడేనా అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. గతంలో ఇలాంటి హూడీ టీషర్ట్‌లను అల్లు అర్జున్‌ (Allu Arjun) , మహేష్‌ బాబు (Mahesh Babu) , ఎన్టీఆర్‌ (Jr NTR) కూడా ధరించారు అంటూ కొన్ని ఫొటోలను షేర్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఇక చరణ్‌ పాల్గొన్న ఈ ఎపిసోడ్‌లో యువ హీరో శర్వానంద్‌, నిర్మాత్‌ విక్రమ్‌ కూడా పాల్గొన్నారు అని ఫొటోలు చూస్తే అర్థమవుతోంది.

ప్రభాస్‌ (Prabhas) – విక్రమ్‌ – శర్వానంద్‌ (Sharwanand) – రామ్‌చరణ్‌ – రానా (Rana) మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఇక ప్రభాస్‌కి చరణ్‌ చేసిన ఫోన్‌ కాల్‌ కూడా ఈ ఎపిసోడ్‌కి హైలైట్‌ అవుతుంది అని చెబుతున్నారు. గతంలో అన్‌స్టాపబుల్‌ షోకి ప్రభాస్‌ వచ్చినప్పుడు రామ్‌చరణ్‌కు ఫోన్‌ చేశాడు. అప్పుడు చాలా ఆసక్తికర సంభాషణ జరిగింది. మరిప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus