ముచ్చటగా మూడోసారి చరణ్ – కొరటాల అనౌన్స్ మెంట్..?

మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు . ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని 2020 జులై 30 న విడుదల చేస్తానని రాజమౌళి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం తరువాత చరణ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మొదట ‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి పేరు వినిపించింది. అయితే ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ పేరు వినిపిస్తుంది.

అందుతున్న సమాచారం ప్రకారం.. చరణ్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడట. ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించనుంది. హీరోయిన్లుగా కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ లను తీసుకున్నారట. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ చిత్రాన్ని తెరకెక్కించాల్సి ఉంది. ఇది పూర్తయిన తరువాతే ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. రాంచరణ్- కొరటాల ప్రాజెక్ట్ ఇప్పటికే రెండు సార్లు మొదలుపెట్టినా.. ఏమైందో ఏమో… ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు. మరి ఈ సారైనా చరణ్- కొరటాల చిత్రం మొదలవుతుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus