Ram Charan: రాజమౌళిని చరణ్‌ పొగిడితే.. ఇప్పుడు చరణ్‌ను వాళ్లు..!

‘ఆర్ఆర్ఆర్‌’తో పాన్‌ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు రామ్‌చరణ్‌. ఇప్పుడు ఆ సినిమా అంతర్జాతీయ ప్రచారంతో గ్లోబల్‌ గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో చరణ్‌కు వస్తున్న ప్రశంసలు, బిరుదులు, పేర్లు చూస్తుంటే.. చిరంజీవి పుత్రోత్సాహం మామూలుగా ఉండదు అని అంటున్నారు. తాజాగా చరణ్‌కు హాలీవుడ్‌ మీడియా సంస్థ పెట్టిన పేరు చూస్తే.. ఫ్యాన్స్‌ పూనకాలు మామూలుగా ఉండవు. ఎందుకంటే చరణ్‌ను బ్రాడ్‌పిట్‌ ఆఫ్‌ ఇండియా అని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అన్నారు కాబట్టి.

హాలీవుడ్‌లో బ్రాడ్‌పిట్‌ చేసిన సంచలనాలు మీకు తెలిసిందే. అలాంటి హీరోతో చరణ్‌ను పోలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో తొలుత పాల్గొన్న రామ్ చరణ్… ఆ తర్వాత ఏబీసీ న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పుడు KTLA5 న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అక్కడే ‘బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా’ చరణ్‌ అనే పిలుపు వినిపించింది. దీంతో ఆ విషయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చరణ్‌కు వస్తున్న బజ్‌, క్రేజ్‌ చూసి వావ్‌ అంటున్నారు ఫ్యాన్స్‌.

ఇక ఆస్కార్స్ వేదికపై ‘నాటు నాటు..’ పాట లైవ్ పెర్ఫార్మన్స్ గురించి అడగగా.. ఆ పాటను ఆదరించి ఫ్యాన్స్‌, ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు. ఇప్పుడు ఆ పాటకు లైవ్‌ పెర్ఫార్మన్స్ చేయడం ద్వారా ప్రేక్షకులకు మా ప్రేమను చూపించాలని అనుకుంటున్నాం. ప్రేక్షకులకు ఇది ట్రిబ్యూట్ అని పేర్కొన్నాడు. ఇక అంతకుమందు ఓ సెలబ్రిటీ చరణ్‌ పక్కన నిలబడటమే తనకు అవార్డు అని పొగిడేసింది. ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డుల్లో ఇది జరిగింది. ‘బెస్ట్ వాయిస్ ఆర్ మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్’ కేటగిరీలో అవార్డు ప్రకటించడానికి చరణ్‌తో హాలీవుడ్ నటి అంజలి బీమని వచ్చింది.

ఈ క్రమంలోనే ఆ కామెంట్స్‌ చేసింది. ఆస్కార్స్‌ జరిగేలోపు రామ్‌చరణ్‌ మరికొన్ని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. అలాగే తారక్‌ వచ్చాక అతనితో కలసి కొన్ని ఇంటర్వ్యూలు వస్తాయి. ఇలా చరణ్‌ను హాలీవుడ్‌ మీడియా ఏమంటుందో త్వరలో తెలుస్తుంది. ‘నాటు నాటు…’ పాటకు ఆస్కార్ నామినేషన్ వచ్చిన విషయం తెలిసిందే. 13న జరిగే ఈ అవార్డు వేడుకకు రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, తారక్‌ తదితరులు హాజరవనున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus