చెర్రీ బాబు….నీ ఐడియా సూపర్!!

టాలీవుడ్ లో ఎన్నో నిర్మాణ సంస్థలు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాయి…అదే క్రమంలో ఎవరి రూట్ వారిది…ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ నుంచి ‘కొణిదెల ప్రొడక్షన్స్’ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు మన మెగా పవర్ స్టార్ రామ్ చరన్…ఇక ఈ ప్రొడక్షన్స్ లో తొలి సినిమాని అమ్మ పేరుపై నిర్మిస్తున్నాడు….అంతేకాదు....మెగాస్టార్  హీరో కూడా…ఇక సొంత అక్కె ఫ్యాషన్ డిసైనర్. ఇలా అన్నీ సొంత వారితో స్టార్ చేసిన చెర్రీ…ఇప్పటివరకూ ఎవ్వరూ ఊహించని విధంగా సరికొత్త పద్దతిలో ఈ ప్రొడక్షన్ హౌస్ ను ప్రమోట్ చేస్తున్నాడు. ఇంతకీ చెర్రీ ప్లాన్ ఏంటో తెలియాలంటే….ఈ కధ చదవాల్సిందే….సహజంగా టాలీవుడ్ పెద్ద ప్రొడ్యూసర్లందరూ.. ఒక సినిమాను ఒక పర్టిక్యులర్ పి.ఆర్.ఓ చేతిలో పెట్టి ప్రమోట్ చేసుకుంటారు….అదే పద్దతిని చెర్రీ ఫాలో అవకుండా…కొత్తగా ప్లాన్ చేస్తున్నాడు…..అదేమిటంటే….ఆల్రెడీ ఫిలిం జర్నలిజంలో అనుభవం ఉన్న కొంతమందిని తన మీడియా మేనేజ్మెంట్ టీమ్ క్రింద పెట్టుకున్నాడట చెర్రీ .

అంతే కాదు.. వీరిలో కొందరు సోషల్ మీడియా ప్రమోషన్ ఎక్సపర్టులు కూడా ఉన్నారట. వీరందరూ ఇప్పుడు నిరంతరం రామ్ చరణ్ సైడ్ నుండి ఖైదీ నెం 150 సినిమాను హ్యాండిల్ చేస్తున్నారట. వీరందరూ కూడా ముంబయ్ అండ్ బెంగుళూరులో సోషల్ మీడియాలో పనిచేసిన నిష్ణాతులు కావడంతో.. సినిమాను ప్రమోట్ చేయడం వీరికి చాలా ఈజీ అయిపోయింది. ఇలా కొత్తగా…సరికొత్తగా….సినిమాను ప్రమోట్ చేసుకుంటూ సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేస్తున్నాడు మన హీరో.

https://www.youtube.com/watch?v=Iwm3_LQACdc

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus