పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిరుత సినిమాతో రామ్ చరణ్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు. తొలి సినిమాతోనే సక్సెస్ ను అందుకుని కమర్షియల్ హీరో అనిపించుకున్న చరణ్ ఆ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాలో నటించారు. 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన మగధీర 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించడంతో పాటు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ రెండు సినిమాల తరువాత చరణ్ బొమ్మరిల్లు, పరుగు సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఆరెంజ్ సినిమాలో నటించారు.
2010 సంవత్సరం నవంబర్ 26వ తేదీన విడుదలైన ఆరెంజ్ సినిమా కథ, కథనంలోని లోపాల వల్ల డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఒక వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చినా ఈ సినిమాకు కలెక్షన్లు ఎక్కువగా రాలేదు. మెగా బ్రదర్ నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించగా నాగబాబుకు ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చింది. విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడంతో నాగబాబు ఈ సినిమా కోసం దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
ఆరెంజ్ సినిమా మిగిల్చిన నష్టాల వల్ల నాగబాబు సినిమా నిర్మాణానికి దూరమయ్యారు. అయితే నాగబాబు తాజాగా ఆరెంజ్ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఒక నెటిజన్ ఆరెంజ్ మూవీ ఫ్లాప్ తర్వాత చరణ్ కు మనీ ఇచ్చారా..? అని ప్రశ్నించగా చరణ్ కు భవిష్యత్తులో ఆరెంజ్ సినిమా రెమ్యునరేషన్ ఇవ్వాలని నాగబాబు అన్నారు. ఆరెంజ్ సినిమా అప్పుల్లో సగం అన్నయ్యే తీర్చాడని నాగబాబు చెప్పుకొచ్చారు. ఆరెంజ్ సినిమా తరువాత దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కు, హీరోయిన్ జెనీలియాకు సినిమా ఆఫర్లు తగ్గిన సంగతి తెలిసిందే. ఒకవిధంగా ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఫ్రీగా నటించారని చెప్పవచ్చు.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!