Peddi: ‘పెద్ది’కి నార్త్ లో గట్టి పోటీ.. ఆ మూడు సినిమాలతో డేంజర్ బెల్స్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా కోసం నార్త్ ఇండియాలో భారీ ప్లానింగ్ జరుగుతోంది. 2026 మార్చి 27న ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. అయితే హిందీ బాక్సాఫీస్ దగ్గర చరణ్ కు సోలో రిలీజ్ దొరకడం కష్టంగానే కనిపిస్తోంది. సరిగ్గా ఈ సినిమా రావడానికి ఒక వారం ముందే, అక్కడ బాక్సాఫీస్ దగ్గర మూడు భారీ సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. ఈ పోటీ చరణ్ సినిమా ఓపెనింగ్స్ మీద, థియేటర్ల కౌంట్ మీద గట్టి ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Peddi

అసలు విషయం ఏంటంటే.. 2026 మార్చి 19, 20 తేదీల్లో ఈద్ పండగ సందర్భంగా బాలీవుడ్, శాండిల్ వుడ్ నుంచి ముగ్గురు బడా స్టార్లు బరిలోకి దిగుతున్నారు. కేజీఎఫ్ తో నార్త్ లో మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న యష్, తన కొత్త సినిమా ‘టాక్సిక్’తో మార్చి 19న వస్తున్నారు. యష్ క్రేజ్ దృష్ట్యా మాస్ థియేటర్లు ఎక్కువగా ఆ సినిమాకే వెళ్లే ఛాన్స్ ఉంది. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, రెండో వారంలో కూడా అంటే పెద్ది రిలీజ్ టైమ్ కి మెజారిటీ స్క్రీన్లు యష్ చేతిలోనే ఉంటాయి.

మరోవైపు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ తన సూపర్ హిట్ కామెడీ ఫ్రాంచైజీ ‘ఢమాల్ 4’తో మార్చి 20న థియేటర్లలోకి రానున్నారు. కామెడీ సినిమాలు సాధారణంగా లాంగ్ రన్ లో బాగా ఆడుతాయి. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ను లాగేసుకుంటే, పెద్దికి ఆ సెక్షన్ ఆడియన్స్ ను రప్పించడం సవాలుగా మారుతుంది. వీరికి తోడు రణవీర్ సింగ్ నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ కూడా ఇదే రేసులో ఉంది. ఇలా మూడు వైపులా నుంచి గట్టి పోటీ పొంచి ఉంది.

ఈ క్లాష్ వల్ల మల్టీప్లెక్స్ లలో షోల సంఖ్య తగ్గే ప్రమాదం లేకపోలేదు. అయితే ‘పెద్ది’కి ఉన్న సానుకూల అంశం ఏంటంటే, అది ఒక స్పోర్ట్స్ డ్రామా కావడం. హిందీ ఆడియన్స్ కు ఇలాంటి ఎమోషనల్ స్పోర్ట్స్ కథలు బాగా నచ్చుతాయి. దానికి తోడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, జాన్వీ కపూర్ గ్లామర్ సినిమాకు ప్లస్ పాయింట్లు. ఇప్పటికే ‘చికిరి చికిరి’ పాట అక్కడ వైరల్ అవ్వడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags