గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గాయపడినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అభిమానులను కొంచెం టెన్షన్ కి గురిచేస్తుంది అనే చెప్పాలి. అసలు విషయంలోకి వెళితే… ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi) షూటింగ్‌లో బిజిగా గడుపుతున్నారు.
మార్చి 27నే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో శరవేఘంగా షూటింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో రామ్ చరణ్‌కు స్వల్ప గాయమైనట్టు తెలుస్తుంది. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో భాగంగా రామ్ చరణ్ గాయపడినట్టు చెబుతున్నారు.ఇది ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కావడంతో షూటింగ్ టైమ్లో రామ్ చరణ్ కంటికి స్వల్ప గాయమైందట. కొన్ని గంటలకే ఈ వార్త వైరల్ అయిపోయింది. చరణ్ అభిమానులు కంగారు పడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.ఈ విషయంపై చిత్ర బృందాన్ని సంప్రదించగా వారు క్లారిటీ ఇవ్వడం జరిగింది.
‘అభిమానులు ఎటువంటి కంగారు పడాల్సిన పనిలేదు. చరణ్ గారికి చిన్న గాయమైంది. వైధ్యులు 2 రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారు’ అంటూ వారు క్లారిటీ ఇచ్చారు. ‘పెద్ది’ సినిమాని కూడా ఏప్రిల్ 30 కి రిలీజ్ చేయాలనే దృడ సంకల్పంతో పనిచేస్తున్నట్టు కూడా వారు ఈ సందర్భంగా తెలియజేశారు.
‘ఉప్పెన’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న రెండో సినిమా కావడంతో ‘పెద్ది’ పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.