Acharya Teaser: సిద్ధ పాత్రలో చరణ్ అదుర్స్.. ఫ్యాన్స్ కు పూనకాలే!

కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి, చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య మూవీ 2022 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా నుంచి తాజాగా రామ్ చరణ్ పోషిస్తున్న సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజైంది. 72 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. టీజర్ లో చరణ్ కొత్త లుక్ లో ఆకట్టుకున్నారు.

క్లాస్ గా కనిపిస్తూనే మాస్ డైలాగ్స్ చెబుతూ చరణ్ సిద్ధ పాత్రలో ఒదిగిపోయారు. “ధర్మస్థలికి ఆపదొస్తే అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది” అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీజర్ లో నీలాంబరి పాత్రలో నటిస్తున్న పూజా హెగ్డేకు కూడా కొరటాల శివ ప్రాధాన్యత ఇచ్చారు. టీజర్ చివర్లో చిరంజీవి, చరణ్ కలిసి కొన్ని సెకన్లే కనిపించినా ఆచార్యతో ఫ్యాన్స్ కు పూనకాలు గ్యారంటీ అని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.

రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టీజర్ ను చూడటానికి రెండు కళ్లు చాలటం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొరటాల శివ మాస్ ప్రేక్షకులకు నచ్చేలా టీజర్ ను కట్ చేశారు. కొరటాల శివ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోనున్నారని ఈ టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. ఆచార్య మూవీకి రికార్డు స్థాయిలో బిజినెస్ జరగగా అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus