హీరో రామ్ చరణ్ సొంత బ్యానర్ లో అఖిల్ సినిమా

  • November 26, 2018 / 11:45 AM IST

హీరో రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను తో చేస్తున్న ‘వినయ విధేయ రామ’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. మరో పక్క డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘సైరా’ సినిమాని తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఒక వేడుకలో కథ నచ్చితే వేరే హీరోతో కూడా సినిమా నిర్మించడానికి నేను రెడీ అని చెప్పిన రామ్ చరణ్ మాటలు నిజం కానున్నాయని ఫిలిం నగర్ టాక్. అందులో భాగంగానే అక్కినేని వారసుడు అఖిల్ నటించబోయే సినిమాకు చరణ్ ప్రొడ్యూసర్ అనే వార్తలు ఇటీవల
వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం హీరో అఖిల్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కథ రీత్యా ఎక్కువభాగం విదేశాల్లోనే ఉంటుందని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది లో విడుదల కానుంది. ఇక అఖిల్ తన నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ డైరెక్టర్ బోయపాటి శ్రీను ‘వినయ విధేయ రామ’ సినిమా సెట్ లో అఖిల్ తో చేయబోయే సినిమాకి చరణ్ ని ప్రొడ్యూసర్ గా ఒప్పించాడనే టాక్ వినిపిస్తుంది. మరి చరణ్ బ్యానర్లో బోయపాటి, అఖిల్ కాంబినేషన్లో సినిమా ఉంటుందనే వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus