Ram Charan, Upasana: ఆ విషయంలో ఎవరి లెక్కలు వారివేనా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీ అయినటువంటి వారిలో రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒకరు రాంచరణ్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకోగా ఉపాసన సైతం బిజినెస్ రంగంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా వీరిద్దరూ కూడా వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి. ఇక ఉపాసన రాంచరణ్ వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెద్దల సమక్షంలో వీరి ప్రేమ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇకపోతే వీరి వివాహం జరిగిన పది సంవత్సరాలకు వీరిద్దరు తల్లిదండ్రులుగా మారారు ఇలా వీరి జీవితంలోకి తమ కూతురు వచ్చిన తర్వాత మరింత సంతోషంగా ఉన్నట్లు ఉపాసన పలు సందర్భాలలో తెలియజేశారు. ఇలా వీరిద్దరి వివాహం జరిగి 10 సంవత్సరాలు అయినప్పటికీ ఒక విషయంలో మాత్రం ఎవరి లెక్కలు వారివేనని ఆ విషయంలో మాత్రం వీరిద్దరూ వేరుగా ఉన్నారని తెలుస్తోంది.

మరి వీరిద్దరూ సపరేట్ గా ఉన్నటువంటి ఆ విషయం ఏంటి అనే విషయానికి వస్తే వీరి సంపాదన విషయంలో ఎవరి లెక్కలు వారివేనని ఒక వార్త వైరల్ గా మారింది. ఉపాసన వ్యాపార రంగంలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని కోట్లలో సంపాదిస్తున్నారు. ఇక చరణ్ సైతం ఒక్కో సినిమాకు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇలా కోట్లలో సంపాదిస్తున్న వీరిద్దరూ మాత్రం ఒకరి సంపాదన గురించి మరొకరు ఎప్పుడు అడగరట అంతేకాకుండా ఎవరి సంపాదన వారి ఇష్టం అని తెలుస్తుంది.

ఇలా ఉపాసన (Upasana) సంపాదించిన డబ్బులు పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగిస్తున్నారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఎప్పుడూ కూడా అంత ఖర్చు చేస్తున్నావనే మాట చరణ్ నుంచి రానిలేదట .ఉపాసన సైతం చరణ్ రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడు ప్రశ్నించరని తెలుస్తోంది. ఇలా సంపాదన విషయంలో ఎవరి లెక్కలు వారివేనంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus