‘భీమ్’ ను అగ్రెసివ్ గా పరిచయం చేసిన ‘రామరాజు’..!

వాడు కనబడితే సముద్రాలు తడపడతాయ్..!
నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి..!
వాడి పొగరు ఎగిరే జెండా..!

వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ..!
వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ..!

నా తమ్ముడు గొండు బెబ్బులి.. కొమరం భీమ్ … అంటూ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేసాడు మన అల్లూరి సీతారామరాజు అదేనండీ మన రాంచరణ్. టీజర్ విడుదలవ్వడం లేట్ అయితే అయ్యింది కానీ.. ఇంత గొప్ప టీజర్ కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేసినా తప్పులేదు అనిపించేలా ఉంది. ఉగాది రోజున చరణ్ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ బాగా హైలెట్ అయ్యింది. అయితే ఆ స్థాయిలో మరో హీరో చరణ్ చెప్పగలడా అని చాలా మందికి సందేహం కలిగింది.

అయితే ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లో చరణ్ వాయిస్ ఓవర్ కూడా బాగా హైలెట్ అయ్యింది. ‘మగథీర’ లో ‘ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్.. వంద మందిని ఒకేసారి రమ్మను’ అంటూ అగ్రెసివ్ గా డైలాగ్ చెప్పాడు చరణ్. మళ్ళీ ఆ స్థాయి పవర్ ఫుల్ రోల్ ఇప్పటివరకూ చరణ్ కు పడలేదనే చెప్పాలి. కానీ ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లో మాత్రం… ‘మగథీర’ కు 10 రెట్లు అగ్రెసివ్ గా చెప్పాడనే చెప్పాలి.సినిమాలో కూడా అదే స్థాయిలో చరణ్ తో పవర్ ఫుల్ డైలాగులు చెప్పించాడట రాజమౌళి. ఏమైనా చరణ్ ఈ టీజర్ కు మాత్రం వందకు వంద శాతం న్యాయం చేసాడు కాబట్టి.. మెగా ఫ్యాన్స్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగానే ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus