Ram Charan: గేమ్ ఛేంజర్ కోసం శంకర్ ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనా?

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్నటువంటి చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇప్పటికే దాదాపు 70% షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మొదటి సారి ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారు. ఇక ఈ సినిమాలో అంజలి, కియారా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే తిరిగి షూటింగ్ పనులు ప్రారంభించబోతోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి దిల్ రాజు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.శంకర్ ఈ సినిమా కథను తన వద్దకు తీసుకు వచ్చినప్పుడు ముందుగా ఈ సినిమాకు హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తీసుకుందామని తనతో చెప్పారట.అయితే కథ విన్నటువంటి తాను ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ సెట్ అవరని సలహా ఇచ్చినట్లు తెలిపారు. ఈ కథ మొత్తం విన్న తర్వాత ఈ కథకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్ఫెక్ట్ గా సరిపోతారని శంకర్ కి చెప్పగా ఆయన రామ్ చరణ్ వద్దకు వెళ్లి కథను వివరించారట.

అయితే కథ చెప్పే సమయంలో ఇద్దరికీ ఈ కథ బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమాకు (Ram Charan) రాంచరణ్ ఫర్ఫెక్ట్ అని భావించిన శంకర్ ఈ సినిమా పనులను ప్రారంభించారని ఈ సందర్భంగా దిల్ రాజు తెలియజేశారు. ఈ విధంగా గేమ్ ఛేంజర్ సినిమాకు రాంచరణ్ ఫస్ట్ ఛాయిస్ కాదని పవన్ కళ్యాణ్ అని తెలియగానే పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమా కనుక పవన్ కళ్యాణ్ చేసి ఉంటే మరో లెవెల్ ఉండేదని భావిస్తున్నారు.ఏది ఏమైనా బాబాయ్ చేయాల్సిన సినిమాలో అబ్బాయి నటిస్తున్నారని తెలియడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus