Ram Charan: గేమ్ ఛేంజర్ సినిమాకు ఆ సీన్ ప్లస్ కావడం ఖాయమే.. కానీ?

రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ లేదు. దిల్ రాజు సైతం ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు 500 మందితో ఒక ఫైట్ సీన్ ను ప్లాన్ చేశారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ ఫైట్ సీన్ ను మించేలా మరో ఫైట్ సీన్ ఉండనుందని సమాచారం అందుతోంది.

గేమ్ ఛేంజర్ సినిమాకు యాక్షన్ సీన్లు హైలెట్ గా నిలవడం ఖాయమని ఈ ఫైట్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ సినిమా శంకర్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో ఒకటని ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఉండనుందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ రేంజ్ ను మరింత పెంచేలా శంకర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా.

గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే ఏడాది సెకండాఫ్ లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ నటిస్తుండగా చరణ్, కియారా కాంబో సీన్లు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో చరణ్ తర్వాత సినిమాలతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.

రామ్ చరణ్ (Ram Charan) తన రేంజ్ ను పెంచే ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మగధీర తరహా ప్రాజెక్ట్ లకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సక్సెస్ సాధిస్తే చరణ్ శంకర్ కాంబోలో మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus