Game Changer: గేమ్ ఛేంజర్ స్టోరీ లైన్ రివీల్ చేసిన అమెజాన్ ప్రైమ్ .. ఏమైందంటే?

  • March 21, 2024 / 12:15 PM IST

రామ్ చరణ్ (Ram Charan) శంకర్ (Shankar)  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా సుదీర్ఘ కాలం పాటు షూటింగ్ జరుపుకున్న సినిమాలలో ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం అయ్యాయట. అమెజాన్ ప్రైమ్ స్వయంగా ఈ విషయాలను వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ రైట్స్ కోసం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసిందని తెలుస్తోంది.

మరోవైపు అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా స్టోరీ లైన్ ను సైతం రివీల్ చేసింది. నిజాయితీపరుడైన ఐఏఎస్ ఆఫీసర్ కు, అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వానికి మధ్య ఎన్నికల బ్యాక్ డ్రాప్ లో జరిగే సమరం గేమ్ ఛేంజర్ అంటూ ప్రైమ్ వీడియో స్టోరీ లైన్ ను రివీల్ చేసింది. స్టోరీ లైన్ సింపుల్ గానే ఉన్నా శంకర్ మార్క్ తో ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రామ్ చరణ్ లుక్ కు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. మరోవైపు మరికొన్ని రోజుల్లో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ బుచ్చిబాబు  (Buchi Babu Sana) కాంబో మూవీ షూట్ కూడా త్వరలో మొదలుకానుంది. చరణ్ తర్వాత ప్రాజెక్ట్ ల గురించి కూడా మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. వేగంగా సినిమాలలో నటిస్తున్న రామ్ చరణ్ సినిమాల ద్వారా భారీ విజయాలు దక్కేలా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు.

రామ్ చరణ్ సక్సెస్ రేట్ చాలామంది హీరోలతో పోల్చి చూస్తే ఎక్కువనే సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ సినిమాలలో ఒకటిగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రామ్ చరణ్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.

గేమ్ ఛేంజర్ సినిమాను ఈ ఏడాదే థియేటర్లలో విడుదల చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజున చరణ్ నటిస్తున్న రెండు సినిమాల నుంచి అప్ డేట్స్ రానున్నాయి. చరణ్ బర్త్ డే రోజున గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి స్పష్టత రావాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. రామ్ చరణ్ పరిమితంగా రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus