ఎన్టీఆర్ ను పట్టుకొచ్చినవాళ్ళకి పది లక్షల బహుమానం – వర్మ

  • October 16, 2018 / 12:26 PM IST

మొన్నామధ్య అచ్చుగుద్దినట్లు చంద్రబాబునాయుడులా ఉన్న వ్యక్తిని పట్టుకొస్తే లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించిన వర్మ ప్రకటనకు వెంటనే స్పందన లభించి.. అతడి వివరాలు వర్మకి తెలియజేశారు కొందరు ఔత్సాహికులు. మరి వర్మ ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నాడో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు వర్మ మరో ఎనౌన్స్ మెంట్ ఇచ్చాడు. తాను తెరకెక్కిస్తున్న “లక్ష్మీ ఎన్టీఆర్” కోసం అచ్చుగుద్దినట్లుగా ఎన్టీఆర్ లా కనిపించే వ్యక్తిని ఎవరైనా తన వద్దకు తీసుకొస్తే అక్షరాలా పది లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తానని ట్విట్టర్ సాక్షిగా ప్రకటించాడు. దాంతో ఇప్పుడు నేటిజనులందరూ వర్మ చెప్పినట్లుగా ఎన్టీఆర్ పోలికలతో ఉండే వ్యక్తి కోసం ఉర్లను జల్లెడపట్టడం మొదలెట్టారు.

యుగ పురుషుడు లాంటి ఎన్టీఆర్ ను పోలి ఉన్న వ్యక్తులు దొరకడం కష్టం కాబట్టి అచ్చుగుద్దినట్లు ఎన్టీఆర్ లా ఉండే వ్యక్తి దొరకడం కష్టమే అనుకోండి. అయితే.. చనిపోయిన వీరప్పన్ నే మళ్ళీ పుట్టించిన ఘనత ఉన్న వర్మకు ఎన్టీఆర్ లా ఉండే నటుడ్ని వెతికిపట్టుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. మరి “లక్ష్మి ఎన్టీఆర్”లో ఎన్టీఆర్ గా ఎవర్ని ఎంపిక చేస్తాడో చూడాలి. మరి ఈలోపు ఎవరికైనా ఎన్టీఆర్ లాంటి వ్యక్తి దొరికితే మాత్రం హ్యాపీగా పది లక్షల రూపాయలు బ్యాగ్ లో పెట్టుకొని వర్మ ఆఫీస్ నుంచి వెళ్లొచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus