వివాదాస్పద కామెంట్లు చేస్తూ ఎప్పుడు వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్తగా రూల్స్ తప్పడం లో వింత ఏముంది అనుకుంటున్నారా?… ఇందులో వింత లేదు కానీ కొత్త విషయం దాగుంది. కృతజ్ఞత అనే పదాన్ని పలకడం కూడా ఇష్టపడని వర్మ.. సోషల్ మీడియా వేదికపై కింగ్ నాగార్జున చేసిన మేలును గుర్తుచేసుకున్నారు.
నాగ్ జన్మదినం సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. “నేను సాధారణంగా ఎవరకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పను. కానీ నాకు డైరక్టర్ గా జన్మనిచ్చిన నాగ్ కి మాత్రం చెబుతున్నాను.” అంటూ గత నెల 29 న విష్ చేశారు. ఆ ట్వీట్ ని నాగార్జున గురువారం చూసుకున్నారు. ఆలస్యంగా చూసుకున్నా వెంటనే అతనికి రిప్లై కూడా ఇచ్చారు. ” హే రాము.. థాంక్స్. శివ సినిమా నా లైఫ్ ని కూడా మార్చింది” అంటూ రీ ట్వీట్ చేశారు.
I normally don’t wish anyone on his birthday but since @iamnagarjuna gave birth to me as a director,he’s the only exception to the rule