పక్కవాడి సినిమా పోతే భలే ఆనందం : ఆర్జీవీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో ఈ సినిమాలో నటిస్తుండగా అలియా భట్, ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాదాపు 450 కోట్ల రూపాయలు ఈ సినిమాపై నిర్మాత దానయ్య ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటివరకు రాజమౌళి తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చేసిన కామెంట్లు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో ఆర్జీవీ తెరకెక్కించిన ఒక సినిమా ప్రమోషన్స్ లో ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఆర్జీవీ ఈ కామెంట్లు చేశారు.

సినిమా ఇండస్ట్రీ ఏకం కావడం ఎప్పటికీ జరగదని.. ఈ రంగంలో ఎవరి పని వాళ్లది, ఎవరి కాంపిటీషన్ వాళ్లదని ఆర్జీవీ అన్నారు. ఈ రంగంలోనే కాదు అన్ని రంగాలలో ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్జీవీ చెప్పారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరక్కెకుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఫ్లాప్ అయితే ఇండస్ట్రీకి చెందిన వాళ్లు రోడ్లపైకి వచ్చి బట్టలు విప్పి షాంపైన్ తో స్నానం చేస్తారని ఆర్జీవీ తెలిపారు. మనిషి సక్సెస్ లో ఉన్నాడంటే ఇండస్ట్రీకి అంత జెలసీ ఉంటుందని ఆర్జీవీ అన్నారు. పక్కవాడి సినిమా పోతే మిగిలిన వాళ్లకు ఇక్కడ భలే ఆనందంగా ఉంటుందని ఆర్జీవీ వెల్లడించారు.

రాజమౌళిపై కూడా ఇండస్ట్రీ జనాల్లో జెలసీ ఉందని ఆర్జీవీ తెలిపారు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ ఫ్లాప్ అయితే తాను చెప్పిన విధంగానే జరుగుతుందని ఆర్జీవీ అన్నారు. సెన్సార్ నిబంధనల గురించి కూడా మాట్లాడిన ఆర్జీవీ టీవీ, ఆన్ లైన్ మాధ్యమాలకు సెన్సార్ ఉండదని.. థియేటర్ కు మాత్రం సెన్సార్ అర్థం లేని వ్యవహారం అంటూ కామెంట్లు చేశారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus