డ్రగ్స్ మ్యాటర్ ఫై వర్మ సంచలన ఆరోపణలు!

  • July 22, 2017 / 12:10 PM IST

రామ్ గోపాల్ వర్మ…ఈ పేరు వింటేనే ఒక సంచలనం…ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో…దేని గురించి మాట్లాడతాడో…ఎవరిని మెచ్చుకుంటాడో….ఎవరిపై విమర్శలు చేస్తాడో ఆయనకే తెలీదు…అయితే ఆ కధ అంతా పక్కన పెడితే ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్న డ్రగ్స్ మ్యాటర్ చూస్తే ఇప్పటివరకూ దానిపై ఎన్నో వార్తలు…ఎన్నో వదంతులు వస్తూ ఉన్నప్పటికీ దీనిపై రామ్ గోపాల్ వర్మ ఇప్పటివరకూ ఏమి స్పందించలేదు…అయితే ఆయన స్పందించలేదు అన్న వార్తలు సైతం ఇప్పటికీ అందరినీ ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి…అయితే అందరూ ఆలోచించే క్రమంలోనే రంగంలోకి దిగాడు మన వర్మ…ట్వీట్ ద్వారా ఒక బాంబు పేల్చాడు…సినిమా వాళ్ళను సపోర్ట్ చేసుకుంటూ మీడియాపై పోలీస్ డిపార్ట్మెంట్ పై ఫైర్ అయ్యాడు…దీనిపై మాట్లాడుతూ ఈ డ్రగ్స్ వ్యవహారం ఎప్పటినుంచో ఉంది…అయితే సినిమా వాళ్లనే టార్గెట్ చెయ్యడం మీడియా పోలీసు వాళ్ళు చేస్తున్న హడావిడి అని విమర్శలు చేసాడు.

అంతేకాదు…స్కూల్ పిల్లలు…ఐటీ వాళ్ళు…పొలిటికల్ వాళ్ళను వదిలేసి ఎందుకు సినిమా వాళ్లపై పడ్డారు అంటూ విరుచుకు పడ్డారు…అదే క్రమంలో ఈ కేసు డీల్ చేస్తున్న అకున్ సబర్వాల్ పై కూడా కామెంట్ చేస్తూ…ఆయన ఒక బాహుబలి లాగా ఫీల్ అవుతున్నాడు అని ఆయన్ని పెట్టి రాజమౌళి మూడో పార్ట్ బాహుబలి తీయ్యవచ్చు అని ట్వీట్ చేసాడు…ఇప్పుడు ఈ ట్వీట్ టాలీవుడ్ అంతా హల్చల్ చేస్తూ ఉంది…చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus